గ్రేటర్ ఫైట్

Chandrababu-YSR
గ్రేటర్ హైదరాబాద్ పోరుకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హోరాహోరీ పోరుకు సిద్ధపడ్డారు. ప్రతిపక్షాల నాయకులను కాంగ్రెసులోకి ఆకర్షించడం ద్వారా వైయస్ రాజశేఖర రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆధిపత్యం సాగించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రతిపక్షాలను బలహీన పరిచే పనికి ఒడిగట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన తన వైపు తిప్పుకుంటున్నారు. తెరాసకు చెందిన సుదర్సన్ రావు, విజయశాంతి వంటి నాయకులకు ఆయన గాలం వేసినట్లు చెబుతున్నారు. ప్రతిపక్షాల అనైక్యత, మజ్లీస్ తో రహస్య చెలిమి కాంగ్రెసుకు కలిసి వచ్చే అంశాలని అంటున్నారు. హైదరాబాదు పాతబస్తీలో మజ్లీస్ పార్టీ బలంగా ఉంది. అదే విధంగా ఇతర డివిజన్లలో ఏదో మేరకు దానికి ఉనికి ఉంది. ఈ స్థితిలో మజ్లీస్ పోటీ చేసే స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దింపి మిగతా డివిజన్లలో మజ్లీస్ సహకారం తీసుకోవాలని ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఇప్పటికే తన ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఆయన గత కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి కాంగ్రెసుపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెసుకు పోటీ తాము మాత్రమే ఇవ్వగలమని ఆయన చెబుతూ లోకసత్తా, ప్రజారాజ్యం పార్టీలకు ఓటేయవద్దని ఆయన ప్రజలకు నూరిపోసే యత్నం చేస్తున్నారు. ప్రజారాజ్యం, లోకసత్తా పార్టీలపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ పార్టీలు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యాయని ఆయన చెబుతున్నారు. తద్వారా కాంగ్రెసు వ్యతిరేక వోటు ఏకమొత్తంగా తాను రాబట్టుకునే యత్నం చేస్తున్నారు. అదే సమయంలో పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వల్ల హైదరాబాదు ప్రజలు కాంగ్రెసుకు వ్యతిరేకంగా మారుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

గ్రేటర్ హైదారబాద్ ఎన్నికల్లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం వామపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీకి మధ్య సయోధ్య కుదుర్చుడానికి ఆ సిపిఐ, సిపిఎం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ప్రజారాజ్యం గానీ, తెలుగుదేశం గానీ సయోధ్యకు అంగీకరించలేదు. ప్రజారాజ్యం లోకసత్తాల మధ్య స్నేహం కోసం జరిగిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో తెలుగుదేశం, లోకసత్తా, ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి విడివిడిగా హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే ఉంది. సిపిఐ, సిపిఎంలు తెలుగదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఇంత వరకు విభేదాలతో పరస్పర విమర్శలు చేసుకున్న సిపిఐ, సిపిఎంలు ఇటీవలే చేతులు కలిపాయి. దీంతో ఈ రెండు పార్టీలు కలిసే పని చేయడానికి అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+