తెలంగాణ: వైయస్సార్ ఉంటే...

YS Rajasekhar Reddy
తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న ప్రస్తుత తరుణంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే ఎలా ఉండేదనే చర్చ సాగుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డిని సమర్థుడైన నాయకుడిగా భావించడమే ఆ చర్చకు ప్రధాన కారణం. వైయస్ ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉండేవారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. తెరాసను, దాని అధినేత కెసిఆర్ ను నైతికంగా, భౌతికంగా దెబ్బ తీయడానికి వైయస్ రాజశేఖర రెడ్డి నిరంతరం కృషి చేశారు. తెరాస శాసనసభ్యులను చీల్చి కెసిఆర్ పై విమర్శల దాడి చేయించారు. నైతికంగా కెసిఆర్ ను దెబ్బ తీశారు కూడా. వ్యక్తిగత పలుకుబడిని, వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. దాంతో కెసిఆర్ పూర్తిగా బలహీనపడినట్లే కనిపించారు. తెరాసకు ఇక భవిష్యత్తు లేదనే పరిస్థితి వచ్చింది. వైయస్ సమస్య ఎదురైనప్పుడు ఎదుర్కునే పద్ధతిని కాదని, సమస్యను తెచ్చి పెట్టే శక్తులను, పార్టీలను బలహీన పరచడానికి నిరంతరం పని చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒక్కరినొక్కరినే కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానిస్తూ వచ్చారు.

తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెరాస పార్టీలకు చెందిన నాయకులు చడీ చప్పుడు కాకుండా ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెసులోకి వచ్చే పద్ధతిని కాకుండా, ఆ పార్టీల నాయకులపై విమర్శల దాడులు సాగించి కాంగ్రెసులోకి వచ్చే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం చెందేనాటికి అలా రావడానికి సిద్ధపడినవారిలో రోజా, విజయశాంతి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వైయస్ మరణం తర్వాత ఆ వలసలు ఆగిపోయాయి. కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే నాటికే మరిన్ని శక్తులను తన వైపు రప్పించుకుని ఆయనను బలహీనపరిచి ఉండేవారా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకదు. ఏదో ప్రతి వ్యూహం మాత్రం కచ్చితంగా అమలయ్యేదని అంటారు. గతంలో ఒకసారి కాంగ్రెసు మంత్రుల ఇళ్లను ముట్టడించడానికి తెరాస కార్యకర్తలు ప్రయత్నించినప్పుడు ఎదురు దాడికి దిగి తెరాసను ఆత్మరక్షణలో పడేట్లు చేసిన ఉదంతం ఉంది.

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత తెలంగాణ శక్తులన్నీ ఏకమయ్యాయి. దాంతో కాంగ్రెసులోని తెలంగాణ నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. వైయస్సార్ ఉండి ఉంటే తెలంగాణ శక్తులు ఏకం కాకుండా చేసి ఉండేవారని చెప్పవచ్చు. ఆయన తెరాసను బలహీన పరచడానికి ఎంచుకున్న ప్రధాన ఎత్తుగడ. ఎన్నికల్లో కూడా తెలంగాణ శక్తులు ఏకం కాకుండా ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కెసిఆర్ కు వ్యతిరేకంగా పనిచేసే శక్తులను ఆయనను వివిధ మార్గాల్లో ప్రయోగించారని అంటారు. ఆయన కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి విధేయంగా ఉంటేనే రాష్ట్రంలో తలెత్తే సమస్యలకు ఆయనే పరిష్కార మార్గం చూపుతూ వచ్చారు. దీంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై భారం పడలేదు. ఇప్పుడు రోశయ్యను ముఖ్యమంత్రిగా నిలబెట్టాల్నిస భారంతో పాటు తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే పడింది. ఇది పార్టీ అధిష్టానానికి పెద్ద చిక్కు సమస్యగానే మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+