రాజ్యసభకు అల్లు అరవింద్?

వి. హనుమంతరావు రాజీవీ కుటుంబానికి వీరాభిమాని. దాంతో తనకు అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు ఆయన భావిస్తున్నారు. జెడి శీలం సోనియాకు నమ్మకస్థుడు. వచ్చిన చిక్కల్లా వార్త దినపత్రిక అధిపతి గిరీష్ సంఘీకే. ఈ మధ్య కాలంలో ఆయన పత్రిక కూడా ఏ మాత్రం ప్రజలపై ప్రభావం చూపలేకపోతోంది. దాంతో గిరీష్ సంఘీని పక్కన పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగుస్తుండడంతో రాజ్యసభకు ఎంపిక కావాలని ఆయన ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోనియా గాంధీ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. డి. శ్రీనివాస్ కు మరో ఆలోచన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే, మరో మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఈ నియోజకవర్గం నుంచే శాసనమండలికి ఎన్నికై మంత్రి పదవిని చేపట్టాలని చూస్తున్నారట. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం మంత్రివర్గంలో ఇతర ప్రాంతాలకు చెందిన నాయకుడుగా ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ఒక ముస్లిం మంత్రి ఉండాలి. ఇప్పుడు మంత్రివర్గంలో తెలంగాణ నుంచి ముస్లిం వర్గానికి చెందిన మంత్రి ఎవరూ లేరు. దాంతో ఆ పదవి కోసం షబ్బీర్ అలీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు.
కాంగ్రెసులో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిలో ఆ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో రాజ్యసభకు వెళ్లేందుకు అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రజారాజ్యం పార్టీ అధినేత అల్లు అరవింద్ సూచనల మేరకు కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీకి 18 మంది శాసనసభ్యుల బలం ఉంది. వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు తప్ప మిగతా వారు ప్రజారాజ్యం పార్టీకి కట్టుబడి ఉంటారనే అభిప్రాయం ఉంది. వీరి బలానికి కాంగ్రెసు మద్దతు పొందితే రాజ్యసభకు వెళ్లడానికి అల్లు అరవింద్ కు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. దాంతో అల్లు అరవింద్ రాజ్యసభ సీటుపై కన్నేసిట్లు ప్రచారం జరుగుతోంది.