తెరకు చిరు దూరమే

Chiranjeevi
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించే అవకాశం ఉన్నట్లు ఇటీవల ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆయన ఈ విషయాన్ని కొట్టిపారేశారు. తాను రాజకీయాలకే సమయం వెచ్చించదలుచుకున్నానని, సినిమాల్లో నటించబోనని ఆయన చెప్పారు. రెండు పనులు ఒకేసారి చేయలేనని కూడా ఆయన అన్నారు. ఆయన కోసం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ కథ రెడీగా ఉందని గతంలోనే పరచూరి బ్రదర్స్ చెప్పారు. వారు సభా ముఖంగా ఆ విషయం చెప్పారు. అయితే అప్పట్లో చిరంజీవి పెద్దగా స్పందించలేదు. మళ్లీ ఆ విషయం ఇప్పుడు తెర మీదికి వచ్చింది. కానీ, ఆయన సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లో ఆయన వెలుగు వెలగకపోయినా తనకంటూ ఒక ప్రాధాన్యం లభిస్తుండడం పట్ల ఫరవాలేదని అనుకుంటున్నారట. పైగా, ఇప్పుడు బావ మరిదిని రాజ్యసభకు పంపాలని బాధ్యత కూడా ఆయనపై పడింది. ఇందుకు ఆయన కాంగ్రెసు నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. వారు రాయలసీమకు చెందిన సి. రామచంద్రయ్యను ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

రామచంద్రయ్యను నిలబెడితే రాయలసీమకు ప్రాతినిధ్యం కల్పించినట్లు కావడమే కాకుండా ఆయన వల్ల పెద్గగా ఇబ్బందులు ఉండవనేది కాంగ్రెసు నాయకులు ఆలోచనగా చెబుతున్నారు. అల్లు అరవింద్ ను రాజ్యసభకు పంపితే తర్వాత మంత్రి పదవి కూడా అడిగే అవకాశం ఉందని, ఆయన డిమాండ్లు చాంతాడులా సాగుతూనే ఉంటాయని కాంగ్రెసు నాయకులు భయపడుతున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+