నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్ గెలుస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై దేశవ్యాప్తంగా దృష్టి కేంద్రీకృతమైంది. తెలంగాణలోని 12 శాసనసభా స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీకి దిగడమే అందుకు కారణం. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న నేపథ్యంలో శ్రీనివాస్ గెలుస్తారా, లేదా అనేది అందరికీ ఆసక్తిగా మారింది. తానే తెలంగాణను తెస్తానంటూ హామీ ఇస్తూ ఆయన ఓటర్లను ఆకట్టుకోవడానికి నిజామాబాద్ అర్బ్ స్థానంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆయన డక్కామొక్కీలు తిన్నారు. తాను గెలిస్తే ఉప ముఖ్యమంత్రిని అవుతానని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతానని ఆయన తన కాంక్షను కూడా బయటపెట్టుకున్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని తన చెవిలో ఊదారని కూడా ఆయన ప్రచారం చేసుకున్నారు. డి. శ్రీనివాస్ కాంగ్రెసు దిగ్గజం కావపడం, తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉండడం నిజామాబాద్ అర్బన్ స్థానం జాతీయ స్థాయిలో ఆసక్తికరమైన ఎన్నికగా నిలిచింది.

డిఎస్ గెలుపు అంత ఆషామాషీ వ్యవహారం కాదని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఎన్నికలకు ముందు డిఎస్ తెలంగాణ ఊసు కూడా ఎత్తకపోవడం, ఎన్నికల్లోకి దిగగడానే తానే తెలంగాణను తెస్తాననడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. పదవి కాంక్ష తప్ప డిఎస్ కు తెలంగాణపై అంత శ్రద్ధలేదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, తెలంగాణలోని 12 స్థానాల్లో ఏడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, రెండు స్థానాల్లో కాంగ్రెసు డిపాజిట్లు కోల్పోతోందని ఓ ప్రైవేట్ సర్వే తెలియజేస్తోంది. మొత్తం 12 స్థానాల్లో తెలంగాణ కోసం రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తున్నవారే గెలుస్తారని అంటున్నారు. 11 స్థానాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), ఒక స్థానంలో బిజెపి గెలవడం ఖాయమనేది ఆ సర్వే తెలియజేస్తోంది.

కాగా, కాంగ్రెసు రెండు స్థానాలపై ఆశ పెట్టుకుంది. నిజామాబాద్ అర్బన్ స్థానంలోనూ ఎల్లారెడ్డి లేదా చెన్నూరులో తాము గెలుస్తామని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. ఎల్లారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీ చేస్తున్నారు. దీన్ని బట్టి డిఎస్ గెలుస్తారని కాంగ్రెసు నాయకులు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, డిఎస్ గెలుస్తారనేది ఆయన ఇమేజ్ ను బట్టి వేసే అంచనా మాత్రమేనని తెరాస వర్గాలంటున్నాయి. మొత్తం మీద, తెలంగాణ ఎజెండాగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ తినే అవకాశాలున్నట్లు మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. తెరాస తర్వాత స్థానం కాంగ్రెసుకే లభిస్తుందని మాత్రం అంచనాకు వస్తున్నారు. రేపు మంగళవారం 12 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X