నెహ్రూ మాటలు నిజమవుతాయి

Telangana
1948 సెప్టెంబర్ 17వ తేదీకొక చారిత్రక నేపథ్యమున్నది. ఆగస్టు 15, 1947న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా సంస్థానాల విషయంలో ఆంగ్లేయులు ప్రకటించిన కుటిల రాజనీతి ఫలితంగా నైజాం రాజ్యానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. స్వాతంత్ర్య వేడుకలను నిజాం నవాబు నిషేధించినాడు. నైజాం రాష్ట్ర్ర ప్రజల (పూర్తి తెలంగాణాజిల్లాలు, కొన్ని మహారాష్ట్ర్ర జిల్లాలు, కొన్ని కర్నాటక జిల్లాలు) స్వాతంత్ర్యపు టాశలు అడియాశలయినై. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు ఆరంభమయినై. రజాకార్ల దురాగతాలకు నైజాం రాష్ట్ర్రమంతా నెత్తురుటేరులు ప్రవహించినై. ఎట్టకేలకు, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 14 నెలలకు హైదరాబాద్ రాష్ట్ర్రం భారత యూనియన్లో విలీనమైంది. కాబట్టి ఇది 'విలీనదినం'. నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ రాష్ట్ర్ర ప్రజలకు విమోచనం కలిగింది కనుక ఇది 'విమోచనదినం'. విద్రోహులైన పాలకులు మూటాముల్లె సర్దుకున్న దినం కాబట్టి ఇది 'విద్రోహ దినం'. నిజాంపాలన అంతం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరుల త్యాగ ఫలంగా సిద్ధ్హించిన స్వాతంత్ర్యం కనుక ఈ ప్రాంతానికిది 'స్వాతంత్ర్యదినం'. భారతదేశంలో హైదరాబాద్ ఒక ప్రత్యేక రాష్ట్ర్రంగా అవతరించింది. ఆతర్వాత 1952లో మద్రాసునుండి విడివడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర్రం ఏర్పడింది.

అప్పటికే హైదరాబాద్ నగరం దేశంలోనే అతి గొప్ప నగరాలలో 5వ గొప్ప నగరంగా విరాజిల్లుతున్నది. కన్నుకుట్టిన ఆంగ్ల మానస పుత్రులైన ఆంధ్రపాలకులు కుతంత్రంతో, తెలంగాణా ప్రాంతపు నాయకుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని 1956లో తెలంగాణాను ఆంధ్రదేశంలో కలుపుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యం మూన్నాళ్ళ ముచ్చటైంది. కానీ, అలుపెరగని తెలంగాణా వీరులు ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమం ఆరంభించినారు. 1969 లో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అప్పటినుండి ఉద్యమం రగులుతూనే ఉన్నది. ఇన్నేళ్ళకు మన ఆశలు తీరే సమయం ఆసన్నమైంది. తెలంగాణా కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరవీరుల ఆశలు సాకారం కానున్నాయి. 'ఇష్టం లేకపోతే తెలంగాణా ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోవచ్చునని' 1964లో నిజామాబాద్ సభలో ప్రకటించిన జవహర్ లాల్ నెహ్రూ మాటలు నిజం కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+