• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్నపై కవిత 'అదుర్స్'

By Pratap
|

Kavitha
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు కవిత గత వారం రోజులుగా హడావిడి చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాను అడ్డుకోవాలని పిలుపునిచ్చి వివాదానికి తెర తీశారు. ఆమె ప్రకటనతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆమెపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఆమె తెలంగాణ జన జాగృతి అనే సంస్థను ప్రారంభించి కొన్ని తెలంగాణ గ్రంథాలను ప్రచురించారు. ఓ వైబ్ సైట్ ను కూడా ఆవిష్కరించారు. అలాగే, నల్లగొండ జిల్లాలో కొంత మంది విద్యార్థులకు చదువుకోవడానికి సహాయం కూడా చేస్తున్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక పర్వదినం బతుకమ్మను ప్రదర్శించారు. ఆ మధ్య కాలంలో తెలంగాణ వారపత్రికకు శ్రీకారం చుట్టి మానుకున్నారు. ఆమె తెర వెనక చాలా కార్యక్రమాలే చేశారు. కానీ అవేవీ ఆమెకు అంతగా గుర్తింపును తేలేదు. అదుర్స్ సినిమాతో ఆమె వార్తల్లో ప్రధానమైన వ్యక్తిగా మారారు.

32 ఏళ్ల కవిత అమెరికా పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. అమె భర్త అనిల్ వ్యాపారవేత్త. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెకు హైదరాబాదులో బ్యూటీ పార్లర్లున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించాలని ప్రయత్నిస్తున్న ఆమెకు సోదరుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటి రామారావు చాలా కాలంగా బ్రేక్ వేస్తున్నట్లు చెబుతారు. ఇరువురి మధ్య ఆధిపత్య పోరు కూడా చోటు చేసుకున్నట్లు వినికిడి. పత్రిక విషయంలో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని వద్దని కుటుంబ సభ్యులు ఆమెను వారించినట్లు చెబుతారు. అయితే కెసిఆర్ కు మాత్రం కుమారుడి కన్నా కూతురిపైనే మక్కువ ఎక్కువని, ఆమె తెలివితేటలపై కూడా అపారమైన విశ్వాసమని అంటారు.

కెసిఆర్ నవంబర్ 29వ తేదీ నుంచి దీక్ష విరమించే వరకు కెటి రామారావు చాలా చురుగ్గా పనిచేస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో ఆయన పెద్దగా కనిపించడం లేదు. ఆయన ప్రకటనలు కూడా వెలువడడం లేదు. అయితే ఆయన సోదరి కవిత ఒక్కసారిగా తెర మీదికి వచ్చారు. కెసిఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు జరుగుతోందని, అన్నాచెల్లెళ్లు పరస్పరం పైచేయి కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఇద్దరు కూడా చురుగ్గా ఉంటే వారసత్వ రాజకీయాల పేరుతో విమర్శలు మొదలయ్యే ప్రమాదం ఉందని భావించి కెటి రామారావు కాస్తా వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. కవిత ముందుకు రావడంతో ఆయన వెనక్కి తగ్గి తెర మీదికి పెద్గగా రావడం లేదని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X