ముగ్గురికీ సీమాంధ్రనే టార్గెట్

వైయస్ జగన్ దీక్షకు ముందు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించారు. దీక్షకు దిగిన చంద్రబాబుపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. వైయస్ జగన్ సాక్షి మీడియా చంద్రబాబును విమర్సిస్తూ వార్తాకథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఈ రకంగా ఈ ముగ్గురు కూడా రైతు బాంధవుడెవరనే విషయంలో పోటీ పడుతున్నారు. వైయస్ జగన్ తన వైపు ఇతర పార్టీల నాయకులను, క్యాడర్ ను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీ క్యాడర్ జారిపోకుండా చూసుకోవడానికి చంద్రబాబు దీక్షకు దిగారు. చిరంజీవి ప్రయత్నాలు కూడా జగన్ వైపు తన క్యాడర్ వెళ్లకుండా చూసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వంపై పోరాటంగానే ఈ ముగ్గురు నాయకులు చెబుకుంటున్నప్పటికీ సీమాంధ్రలో పైచేయి సాధించి, భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాలను శాసించాలని అనుకుంటున్నారు. చిరంజీవి కాంగ్రెసుతో జత కట్టి అధికారానికి చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం చేపట్టాలనే దీక్షతో చంద్రబాబు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుతో సహా అన్ని పార్టీలను చిత్తు చేసి తానే ముఖ్యమంత్రిని కావాలనే పట్టుదలతో వైయస్ జగన్ ఉన్నారు. ఈ ముగ్గురు నాయకులు కూడా సీమాంధ్రకు చెందినవారు కావడంతో తెలంగాణలో అడుగు పెట్టలేని స్థితి ఉంది. డిసెంబర్ 31వ తేదీలోగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికను చూసిన తర్వాత, పరిణామాలను పసిగట్టిన తర్వాత తెలంగాణ విషయంలో తమ తమ వ్యూహాలకు ఈ ముగ్గురు నాయకులు కూడా పదును పెట్టనున్నారు.












Click it and Unblock the Notifications