వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయపాటిపై పురంధేశ్వరి ఎఫెక్ట్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Purandeswari
రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ప్రకటించడానికి ప్రధాన కారణం కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఫ్యాక్టరే కారణమని అంటున్నారు. ఎన్టీఆర్ కూతురిగా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఆమె తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితి లేదు. పైగా, మంత్రిగా ఆమె ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రశంసలు కూడా అందుకున్నారు. తన పనితీరు ద్వారా ఆమె మన్మోహన్ మనస్సును ఆకట్టుకున్నారు. ఈ స్థితిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మరో పార్లమెంటు సభ్యుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడం కష్టంగానే ఉంటుంది. దశాబ్దాల పాటు కాంగ్రెసుతో ఉన్నా రాయపాటి సాంబశివరావుకు, కావూరి సాంబశివ రావు వంటివారికి దక్కని మంత్రి పదవి అనతి కాలంలోనే పురంధేశ్వరిని వరించింది. అంతేకాకుండా ఆమె స్థానం సుస్థిరమైంది కూడా.

రాయపాటి సాంబశివరావుతో పాటు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ కేంద్ర మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందినవారే కావపడం విశేషం. ఈ స్థితిలో ఇంత మందికి మంత్రి పదవులు లభించడం కష్టమే. కేంద్ర మంత్రి పదవి కోసం లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్ కలిసి ఇటీవల కాంగ్రెసు అధిష్టానానికి చెందిన కొంత మందిని కలిశారని చెబుతున్నారు. ఈ సమయంలో అధిష్టానం అంతరంగం స్పష్టంగా బయటపడిందని చెబుతున్నారు. వస్తే గిస్తే లగడపాటి రాజగోపాల్ కు సహాయ మంత్రి పదవి లభిస్తుందని అంటున్నారు. దానికి తోడు, పార్టీ రాజకీయాల్లో రాయపాటి కన్నా కావూరి సాంబశివరావుకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పరిస్థితిలో తనకు మంత్రి పదవి దక్కడం కల్లే అని రాయపాటి తేల్చుకున్నారని, అందుకే రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారని అంటున్నారు. ఆయనను తమ వైపు తిప్పుకునేందుకు వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలు సాగిస్తోంది.

మరోవైపు, గుంటూరు జిల్లా కాంగ్రెసు రాజకీయాలు కూడా రాయపాటి సాంబశివ రావుకు వ్యతిరేకంగా సాగుతున్నాయి. మంత్రి కన్నా లక్ష్మినారాయణకు ఆయనకూ క్షణం పడడం లేదు. కన్నా లక్ష్మినారాయణకు మంత్రి పదవి ఇవ్వకూడదని, ఆయన అక్రమాస్తులపై విచారణ జరిపించాలని రాయపాటి డిమాండ్ చేస్తూ వచ్చారు. అయినా పార్టీ అధిష్టానం కన్నా లక్ష్మినారాయణకు అనుకూలంగానే వ్యవహరించింది. కాపు సామాజిక వర్గానికి చెందినందు వల్ల కన్నా లక్ష్మినారాయణ ప్రాధాన్యాన్ని కాంగ్రెసు అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు. అంబటి రాంబాబు వైయస్ జగన్ వైపు వెళ్లిన నేపథ్యంలో కన్నా లక్ష్మినారాయణ గుంటూరు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే అవకాశాలున్నాయి. తన సోదరుడు, ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ కైనా రాష్ట్ర మంత్రివర్గంలో చేటు లభిస్తుందని ఆశించారు. ఆ ఆశ కూడా వమ్మయింది. ఇదంతా రాయపాటి మనసును కలత చెందినట్లు భావించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X