సోనియాగాంధీకి, సిఎం కిరణ్ కుమార్ కు వైఎస్ జగన్ ఫివర్!

ఉప ముఖ్యమంత్రి పదవితో తెలంగాణవారితో పాటు, ఎస్సీలను, కేంద్ర పదవుల్లో రాష్ట్ర నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎంపీల్లో కూడా అసంతృప్తిని దూరం చేయాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలో పునర్వ్యవస్థీకరించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కేంద్ర కేబినెట్‌లో రాష్ట్ర నేతలకు చోటు కల్పించే దిశలో సోనియా యోచిస్తోన్నట్టు సమాచారం. వర్కింగ్ కమిటీలో ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించే అవకాశాలున్నాయి. కమిటీలోకి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, ఎంపీ కావూరి సాంబశివరావుకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో సైతం పార్లమెంటు సభ్యులకు ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.
ఇప్పటికే సోనియాగాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనతో పాటు జగన్ పై చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఆయన్ను కట్టడి చేయడానికి ఏం చేయాలనే యోచనలోనే కిరణ్ ఉన్నట్టు తెలుస్తోంది. పైకి జగన్ వల్ల నష్టమేమీ లేదంటున్నప్పటికీ దానిని తీవ్రస్థాయిలో ఆలోచిస్తున్నట్టే కనిపిస్తుంది. కిరణ్ నియామకం నుంచి జగన్ కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన వరకు అనేక అంశాలపై ఆమె సోనియా సైతం చర్చించినట్లు సమాచారం. అయితే జగన్ వంటి విషయాలు రాష్ట్ర రాజకీయాల్లో సాధారణమేనని, దానికి పెద్దగా ప్రాధాన్యం లేదని కూడా సోనియా మరోవైపు పార్టీ వారికి బలం చెబుతోంది. ఇలాంటి వారిని చాలామందిమి చూశామని కూడా పలువురు నేతలు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications