ఆందోళనలో జగన్ గ్రూప్?

వైయస్ రాజశేఖర రెడ్డి సీనియర్లను, అనుభవజ్ఞులను పక్కన పెట్టి జూనియర్లకు, తనకు ప్రీతిపాత్రులైనవారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. దీన్ని పూర్తిగా మార్చేయాలనే ఉద్దేశంతో రోశయ్య ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మంత్రులు, శాసనసభ్యులు రోశయ్య మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ తమను నమ్ముతారా అనే భయం కూడా వారిలో ఉంది. ఈ స్థితిలో వారు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను ఆశ్రయించినట్లు సమాచారం. తనకు అన్యాయం జరగకుండా చూడాలని, రోశయ్యకు, పార్టీకి విధేయతతో పని చేస్తామని వారు డిఎస్ తో చెప్పుకున్నట్లు సమాచారం. ఈ స్థితిలో డిఎస్ మధ్యవర్తిత్వం పాత్ర నెరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసినట్లు చెబుతున్నారు.
రోశయ్యకు, డిఎస్ కు మధ్య శుక్రవారం రాత్రి కీలకమైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పైకి కనిపించకపోయినా డిఎస్ కే కాదు, రోశయ్యకు కూడా వైయస్ జగన్ తీరు నచ్చడం లేదు. వారిద్దరి లక్ష్యం కూడా జగన్ ను వంచడమే. అయితే, ఒకేసారి జగన్ వర్గానికి చెందినవారిని పక్కన పెట్టకూడదనే ఆలోచనలో డిఎస్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయంపై ఆయన రోశయ్యతో మాట్లాడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications