• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సత్తిబాబు స్టైలే వేరు

By Srinivas
|

Botsa Satyanarayana
మంత్రి బొత్స సత్యనారాయణ తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో తాను ఆశించినదో లేక తన స్థాయికి తగినదిగా భావించడం వల్లనో బొత్స సత్యనారాయణ స్టైల్ విభిన్నంగా ఉన్నప్పటికీ ఆ మంత్రివర్గంపై, ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై ఎలాంటి కామెంట్లు చేయలేదు. అయితే రోశయ్య తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో తనకు తగ్గ మంత్రి పదవి ఇవ్వలేదనే ఆగ్రహం ఆయనలో ఇంకా కనిపిస్తున్నట్టుగానే ఉంది. ఆందుకే ఆయన ఏ పార్టీలో ఉండి అయితే మంత్రి పదవి దక్కించుకున్నారో అదే ప్రభుత్వాన్ని, ఏ ముఖ్యమంత్రితో కలిసి పని చేస్తున్నారో ఆ ముఖ్యమంత్రిపైనే విమర్శలు గుప్పిస్తూ మంత్రులల్లకెల్ల తాను వేరన్నట్టు తన స్టైల్‌లో దూసుకుపోతున్నారు.

క్యాబినెట్‌లో తనకు సరియైన స్థానం కల్పించక పోయే సరికి క్యాబినెట్ అంటే ప్రైవేట్ కంపెనీ అనుకున్నావా అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని ఆ సమయంలో ప్రశ్నించాడు. ముఖ్యమంత్రి కేబినెట్ కూర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేబినెట్లో పని చేస్తున్నప్పటికీ తన శాఖపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. మూడు నెలల తర్వాత శాఖ మార్పు చేస్తానని కిరణ్ హామీ ఇవ్వడంతో కాస్త చల్లబడ్డట్టు కనిపించినా లోలోన మాత్రం అసంతృప్తి రగులుతోంది. ముఖ్యమంత్రిపై ఆయన అసంతృప్తి మంగళవారం మరోసారి బయటపడింది. ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్రాజెక్టు రగడ కారణంగా శ్రీకాకుళం జిల్లా వట్టితాండ్రలో ఇద్దరు మరణించడంపట్ల ఆయన స్వయంగా తాను ఏ ప్రభుత్వంలో అయితే ఉన్నాడో అదే ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.

నేరుగా ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి పోలీసుల కాల్పుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారంట. ఆ తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు వచ్చి పోలీసులు తీరు తనను బాధించిందని, ఇది ప్రభుత్వం వైఫల్యం అని ముక్కు సూటిగా చెప్పేశారు. ఏదైన అనుకోని సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారు దానిపైన ప్రభుత్వం తప్పు లేదన్నట్లు వివరణ ఇచ్చుకుంటారు. కానీ బొత్స మాత్రం అందుకు విరుద్దంగా ప్రవర్తించి ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు. అంతేకాదు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే మంత్రులు వెనుకడుగు వేస్తుంటే బొత్స మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై పోరాటం చేస్తున్న సమయంలో జగన్ దీక్షపై కామెంట్లు చేయటం విశేషం. అయితే సత్తన్న ఈ స్టైల్ ఆయనకు ఏదైన మంచి శాఖ వచ్చే వరకు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది. రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి రేసులో ఉన్న తనకు కిరణ్ అంతగా ప్రాధాన్యం లేని శాఖ ఇచ్చారని మూడునెలల తర్వాత శాఖ మార్పులు మాట ఇచ్చిన కిరణ్ తన మాట నిలబెట్టుకోకంటే బొత్స ఢిల్లీకి వెళ్లి గోల చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

English summary
Minister Botsa Satyanarayana style looks different. His way is don't care type. Botsa very disappointed in CM Kiran Kumar Reddy cabinet. So he targeting CM Kiran Kumar Reddy and government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X