వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి మెగా ఫెయిల్యూర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
సినీరంగంలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చి మెగాస్టార్ చిరంజీవి తన భవిష్యత్తును పాడు చేసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు, ఆయనను నమ్ముకున్న చాలా మంది నష్టాల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. తనను నమ్ముకున్న ప్రజలను, కార్యకర్తలను వదిలేసి ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. పార్టీ పెట్టిన కొత్తలో ఆయన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల చేనేత కార్మికులను కలుసుకుని వారిలో ఒక్కడిగా కలిసిపోయిన అనుభూతిని కల్పించారు. వారి సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని నమ్మబలికారు.

నల్లగొండ జిల్లాలోని ఫ్లోరిసిస్ పీడిత ప్రజలను కూడా పలకరించి, వారికి భవిష్యత్తుపై ఆశలు కల్పించారు. ఫ్లోరోసిస్ తాకిడికి గురై అక్కడి ప్రజలు కాళ్లొంకర, పళ్లొంకర... వారి దీనస్థితికి చిరంజీవి కరిగిపోయారు. కానీ వారి బతుకులు తెల్లారలేదు. పార్టీ జెండా మోసినవారు, పార్టీ పతాకలను తయారు చేసినవారు ఒక్కరేమిటి అందరినీ చిరంజీవి నిరాశపరిచారనే చెప్పాలి. తొలిసారి ఎన్నికల్లో గెలవనంత మాత్రాన ప్రజారాజ్యం పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన అనుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది. ఓడిపోయిన కసిలో చాలెంజ్‌గా తీసుకుని పార్టీని తీర్చిదిద్దడంలో చిరంజీవి విఫలమయ్యారనే చెప్పాలి. ఓటమి విజయానికి మెట్టు అనే సూక్తిని పూర్తిగా విస్మరించారాయన.

ఇకపోతే, కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనం గ్రాండ్‌గా జరగాలని చిరంజీవి ఆశ పడ్డారు. కానీ, అదేమీ లేకుండానే విలీన ప్రక్రియ ముగిసిపోతోంది. రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో విలీన ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అనుకున్నారు. అది కూడా జరగడం లేదు. ఆయనే స్వయంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో ఈ నెల 20వ తేదీన కాంగ్రెసు తీర్థం పుచ్చుకోబోతున్నారు. సోనియా గాంధీ అనారోగ్యంతో అమెరికాలో ఉండడంతో ఆమె లేకుండానే విలీన ప్రక్రియ పూర్తవవుతోంది. నిజంగానే, రాజకీయాల్లో చిరంజీవి నెంబర్ వన్ కాలేకపోయారు.

English summary
Prajarajyam party president Chiranjeevi failed to shine in politics. He is facing unfortunate incidents since the inception of Prajarajyam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X