గాలిపై అమ్మవారు కన్నెర్ర జేసిందా?

Gali Janardhan Reddy
కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి పైన సుంకులమ్మ దేవత కన్నెర్ర జేసిందా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట స్థానికభక్తులు. ఓబుళాపురం గనుల్లో ఉన్న సుంకులమ్మ దేవత ఆలయాన్ని కూల్చి వేయాలనే ఆలోచన గాలికి వచ్చినప్పుడు స్థానిక భక్తులు అడ్డుకున్నారు. అయితే ఓ అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో దానిని గాలి కూల్చి వేయించారు. మొదట ఆ గుడిని కూల్చి వేయడానికి గాలి నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారట. ఆ తర్వాత కేరళ నుండి ఓ మాంత్రికుడిని తీసుకు వచ్చి అమ్మను శక్తిహీనురాలిని చేసి గుడిని పేల్చారనే వాదనలు ఉన్నాయి. ఆ గుడిని కూల్చి వేసింది సెప్టెంబరు నెలలో. అయితే నాటి నుండి నేటి వరకు గాలికి అదే నెలలో ఆపదలు వస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఐదేళ్ల క్రితం అంటే 2006 సెప్టెంబరులో సుంకులమ్మ దేవాలయాన్ని గాలి పేల్చి వేశారు. ఆ తర్వాత సంవత్సరమే గాలి సన్నిహితుడు, మాజీ మంత్రి శ్రీరాములు, గాలి సోదరుడి పైన ఆ గ్రామస్థులు పెద్ద గొడవకు దిగారు. రెండేళ్ల తర్వాత అంటే 2008లో గాలి జనార్ధన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇంట్లోకి అమ్మవారు వచ్చి హెచ్చరించినట్లుగా వాదనలు ఉన్నాయి. గాలికి నిత్యం అండగా ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కొన్న నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సాధారణ ఎన్నికల అనంతరం సెప్టెంబర్‌లో నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదంతో మృతి చెందారు. 2010లో గాలి ఇంటి ఆరాధ్య దైవం మల్లేశ్వరస్వామి ఆలయ ధ్వజస్థంభం విరిగిపోయింది. ఆ తర్వాత 2011లో గాలి జనార్ధన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ ఎండి శ్రీనివాస్ రెడ్డి అరెస్టయ్యారు. గాలికి ఆపదలన్నీ సెప్టెంబరులోనే రావడం వెనుక సుంకులమ్మ దేవాలయాన్ని కూల్చిన పాపమే అని స్థానిక భక్తులలో బలంగా ఉందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+