వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ, ఓ సుదూర స్వప్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం హడావిడి చేస్తున్నట్లు ఎప్పటికప్పుడు కనిపిస్తున్నప్పటికీ దాన్ని సుదూర స్పప్నంగా మార్చే వ్యూహాన్నే అనుసరిస్తోంది. శీతాకాలం సమావేశాలకు ముందే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అనుకుంటూ వచ్చారు. కానీ, అదేమీ లేకుండానే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటులో తెలంగాణపై వివిధ పార్టీల తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల నిరసన కూడా పెద్దగా బయటకు కనిపించడం లేదు. ఒక వ్యూహం ప్రకారమే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణను వాయిదా వేస్తూ వస్తోంది. నిజానికి తెలంగాణ అంశాన్ని తేల్చే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం లేదు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా ఆ పార్టీ 2014 పార్లమెంటు, శానససభ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

తమ పార్టీ అధిష్టానం వ్యూహానికి అనుగుణంగానే రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు వ్యవహరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు మాత్రం తెలంగాణ ఊసే మరిచిపోయినట్లు వ్యవహరిస్తున్నారు. కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రాబల్యాన్ని, దూకుడుని తగ్గించడానికి అనుగుణంగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము అగ్రభాగాన ఉన్నట్లు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ కార్యక్రమాల్లో వారు ముందు భాగాన ఉంటున్నారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు కూడా అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు కెసిఆర్‌ను విమర్శించడం లేదు గానీ తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రం నిత్యం నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఇదే రీతిలో తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం నడిపించదలుచుకున్నట్లు అర్థమవుతోంది.

English summary
It is clear that Congress high command is not to take decision on Telangana issue till 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X