అటు జగన్, ఇటు కెసిఆర్

YS Jagan-K Chandrasekhar Rao
ఆంధ్రప్రదేశ్‌ లో తమ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే అభిప్రాయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితిని తమకు అనుకూలంగా ఎలా తిప్పుకోవాలో అర్థం కాని స్థితిలో పడినట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పాగా వేయడం ఖాయమని కాంగ్రెసు అధిష్టానానికి తెలిసిపోయినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ ప్రాబల్యానికి తగ్గించడానికి, కెసిఆర్ దూకుడుకు కళ్లెం వేయడానికి మార్గాల కోసం కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్ రెడ్డి, డికె అరుణలతో జైపాల్ రెడ్డి చెప్పిన మాటలు కూడా ఆ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. పార్టీ అధిష్టానం క్షీరసాగర మథనం చేస్తోందని ఆయన నర్మగర్భంగా చెప్పారు.

కెసిఆర్ ప్రాబల్యం వల్ల తెలంగాణ ఇచ్చినా తమకు ఫలితం దక్కనే అభిప్రాయంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అటు సీమాంధ్రలోనైనా ఫలితం లభిస్తుందా అంటే వైయస్ జగన్ భయం పీడిస్తోంది. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో వైయస్ జగన్ స్వీప్ చేస్తారని భావిస్తున్నారు. దానికితోడు, చాలా మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్‌తో వెళ్లిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణలో కన్నా సీమాంధ్ర నుంచి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ ఇస్తే తాము జగన్‌ బాట పడుతామని వారు అధిష్టానానికి స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతో తెలంగాణ అంశాన్ని కాంగ్రెసు అధిష్టానం అటకెక్కించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది.

తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరితో తెలంగాణ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, నాయకులు తీవ్రమైన ఇరకాటంలో పడ్డారు. ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. అయితే, తెలంగాణ ప్రభావం తక్కువగా ఉన్న కోదాడ వంటి నియోజకవర్గాల శాసనసభ్యులు తెలంగాణ అంశంపై ఆందోళన చెందడం లేదు. దీంతో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకుల్లో తెలంగాణ అంశంపై విభేదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభావం అధికంగా ఉన్న శాసనసభ్యులు, లోకసభ సభ్యులు రాజీనామాలు చేస్తారా అనే ఆందోళన కూడా కాంగ్రెసు అధిష్టానాన్ని పీడిస్తోంది. దీంతో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. తెలంగాణపై అధిష్టానం వైఖరిని తెలుసుకోవడానికి తెలంగాణ ప్రాంత నాయకులు ఆదివారం కె. కేశవరావును కలుసుకున్నారు, సోమవారం జైపాల్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ ఇవ్వబోమని కాంగ్రెసు అధిష్టానం స్పష్టంగా చెప్పకుండానే దాన్ని దాటవేయాలని చూస్తోంది. తెలంగాణ ఇచ్చినా క్రెడిట్ అంతా కెసిఆర్ కొట్టుకుపోతారని, దానివల్ల పార్టీకి నష్టమేనని, కెసిఆర్ తెలంగాణలోని 119 శాసనసభా నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటారని, దానివల్ల తమకు లాభమేమీ ఉండదని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+