వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాములమ్మ స్థానం: కెసిఆర్‌పై పోటీకి జగ్గారెడ్డి సై?

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - Jagga Reddy
మెదక్ జిల్లా సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గా రెడ్డి) వచ్చే సాధారణ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయాలని భావిస్తున్నారట. జిల్లాలో ప్రధానంగా సంగారెడ్డి, ఆ పరిసర నియోజకవర్గాలలో ఆయనకు గట్టి పట్టు ఉంది. దీంతో ఆయన క్రమంగా తన బలాన్ని, బలగాన్ని పెంచుకోవాలని చూస్తున్నారట. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటే ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతాడు.

అలాంటి నేతను తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల్లో గట్టిగా ఎదిరించి మాట్లాడే వ్యక్తుల్లో జగ్గారెడ్డి ముఖ్యుడు. ఆయనలా కెసిఆర్ పైన నిప్పులు చెరగ కలిగే వారు లేరు. అలాంటి జగ్గారెడ్డి క్రమంగా జిల్లాలో తన బలాన్ని పెంచుకోవాలనుకుంటున్నారట. అందుకోసం ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారట. వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయాలని ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నారు.

తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి నుండి తన సతీమణిని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారట. జగ్గారెడ్డి ఇటీవల సొంత జిల్లా మెదక్‌లో పోటీ చేయాలని కెసిఆర్‌కు సవాల్ విసిరారు. మెదక్ ఎంపిగా ప్రస్తుతం విజయశాంతి ఉన్నారు. ఆమె భువనగిరికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. కెసిఆర్ గతంలో కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచినప్పటికీ ఇప్పుడు తెరాస తరఫున అక్కడ పలువురు ఉన్నారు.

ఈ నేపథ్యంలో కెసిఆర్ తన చూపును మెదక్ వైపు సారిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి కాకుండా మెదక్ నుండి ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. అదే సమయంలో జగ్గా రెడ్డి కూడా మెదక్ పార్లమెంటుపై కన్నేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉప్పు నిప్పులా ఉండే జగ్గారెడ్డి - కెసిఆర్‌లు కాంగ్రెసు, తెరాసల తరఫున మెదక్ పార్లమెంటు అభ్యర్థులుగా పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కెసిఆర్ మెదక్ నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న కారణంగా ఆయనను ఓడించాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే జగ్గారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారని అంటున్నారు.

English summary

 It is said that Sanga Reddy MLA Toorpu Jayaprakash Reddy is very interested to contest from Medak parlimentary constitution in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X