ఐఏఎస్‌లు వర్సెస్ రాజకీయ నాయకులు

Political parties came in to same line on IAS issue!
గత మూడు రోజులుగా రాష్ట్రంలో రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందనే చెప్పవచ్చు. సిబిఐ దర్యాఫ్తును ప్రశ్నిస్తూ ఐఏఎస్‌లు భేటీ కావడాన్ని అధికార కాంగ్రెసు పార్టీ నేతలు తప్పు పడుతున్నారు. అయితే విపక్షాలు కూడా వారి వైఖరిని తప్పు పడుతుండటం విశేషం. అయితే అదే సమయంలో అధికార కాంగ్రెసు పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు రోజుల క్రితం అధికారులంతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి సిబిఐ విచారణపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజు ఐఏఎస్ అధికారులు సమావేశమై మీడియా సమావేశం నిర్వహించి మంత్రులపై మండి పడ్డారు. వారి తీరును రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, మంత్రులు డొక్కా మాణిక్య వర ప్రసాద్, మహీధర్ రెడ్డి తదితరులు తప్పు పట్టారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావులు మాత్రమే వారితో ఏకీభవించారు. ఉండవల్లి వంటి నేతలైతే ఐఏఎస్‌లు తీసుకునే నిర్ణయాలతో తమకేమాత్రం సంబంధం లేదన్నారు.

అయితే విపక్ష పార్టీలైన తెలుగుదేశం, టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ తదితర పార్టీలు అధికార కాంగ్రెసుపై విమర్శలు గుప్పిస్తూనే ఐఏఎస్‌ల తీరును తప్పు పట్టాయి. అధికారులు అలా భేటీ కావడం సరికాదని, అలా అని కాంగ్రెసు తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు వీలు లేదని, మంత్రులను విచారించాల్సిందేనని టిఆర్ఎస్ నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే తమపై ఒత్తిడి తీసుకు వచ్చిన వారి పేర్లు బయట పెట్టాలని ఎమ్మెల్యే కెటిఆర్ డిమాండ్ చేశారు. అసలు మంత్రులు చెప్పినట్లు అధికారులు ఎందుకు వింటున్నారని, చట్టం చేస్తేనే ఆమలు పర్చాలని, మౌఖికంగా చెబితే రాతపూర్వకంగా రాసివ్వమనాలని, కానీ మంత్రులు చెప్పాం కాబట్టి మేం విన్నామనటం సరికాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తప్పు పట్టారు. తప్పు చేసిన అధికారులతో పాటు వైయస్ కేబినెట్‌ను విచారించాల్సిందేనని చెప్పారు. మంత్రులు చెప్పినట్లు చేశామని అధికారులు తప్పించుకోవడం సరికాదని అన్నారు.

వంద కోట్లు తిన్న వారిని వదిలి కోటి రూపాయలు తిన్న వారిని టార్గెట్ చేయడమేమిటని ఐఏఎస్‌లు ప్రశ్నించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. అధికారులు అన్న వ్యాఖ్యలు చూస్తుంటే వారు కూడా అవినీతిలో భాగస్వాములు అయినట్లు ఒప్పుకున్నట్లే కదా అని అంటున్నారు. తప్పు చేయకపోతే అవినీతి మంత్రుల పేర్లు బయట పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఐఏఎస్‌లకు రాజకీయ నాయకుల నుండే కాదు మాజీ అధికారుల నుండి కూడా మద్దతు లభించడం లేదు. మాజీ ఐఏఎస్, ప్రస్తుత లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ.. ఐఏఎస్‌లు, ఉన్నతాధికారుల పాత్ర లేకుండా రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడటం ఏమాత్రం సాధ్యపడదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు కుంభకోణాల వెనుక ఉన్న ఐఏఎస్‌లు తప్పించుకునేందుకు కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. అవినీతికి అండ కాస్తున్న ఐఎఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు. మరికొందరు మంత్రులను తప్పు పడుతూనే ఐఏఎస్‌ల పాత్ర ఉంటుందని కూడా అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+