వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ క్యాంప్ ఎమ్మెల్యేలపై వేటు వేళాయెరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran kumar Reddy
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన 16 మంది కాంగ్రెసు శాసనసభ్యులపై అనర్హత వేటుకు వేళయినట్లే. తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుండడంతో జగన్ వర్గం శాసనసభ్యులపై వేటు వేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేయవచ్చునని అంటున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలను రెండు దఫాలుగా ఎదుర్కోవాలనే ఆయన వ్యూహాం ఫలించినట్లే చెబుతున్నారు. ఈనెల 22న ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే రోజు జగన్ వర్గంపై వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు.

ఈనెల 22 నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నందున ఆ రోజే జగన్‌వర్గ ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని కొందరు నేతలు అంటున్నారు. మరికొందరు దీంతో విభేదిస్తున్నారు. ఏప్రిల్ 2వ తేదీలోగా జగన్ అక్రమాస్తుల కేసుపై న్యాయస్థానంలో సీబీఐ అధికారులు చార్జిషీటును దాఖలు చేయాలి. ఆలోగా జగన్‌ను అరెస్టు చేయాల్సి రావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దానివల్ల వెంటనే ఉప ఎన్నికలు వస్తే సానుభూతి పనిచేయవచ్చునని అంటున్నారు. అందువల్ల జగన్ వర్గం శానససభ్యులపై వేటుకు మరింత జాప్యం జరగవచ్చునని అంటున్నారు.

జగన్‌వర్గ ఎమ్మెల్యేలపై మార్చి మొదటి వారంలో అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికల నిర్వహణకు ఆగస్టు వరకూ గడువు ఉంటుందని అంటున్నారు. అప్పటిలోగా జగన్ వెంట ఉండేవారెందరో బయటకు వచ్చేవారెవరో స్పష్టం అవుతుందని, పైగా అరెస్టయిన కొత్తలో ఉన్న సానుభూతి క్రమంగా తగ్గుతుందని కూడా అంటున్నారు.దీని వల్ల ఉప ఎన్నికల్లో విజయం సులువని పేర్కొంటున్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల ఫలితాల కంటే సీమాంధ్రలో జగన్‌వర్గ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో వచ్చే ఫలితాలు కీలకం కానున్నాయి. దీంతో ఈ 17 నియోజకవర్గాల్లో ఎంత ఆలస్యంగా ఉప ఎన్నికలు జరిగితే తమకు అంత మంచిదని కాంగ్రెస్ నేతలంటున్నారు.

English summary
It is said that CM Kiran kumar Reddy strategy to face byepolls in two phases is become true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X