వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఆస్తుల జప్తు దిశగా అడుగులు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల జప్తు విషయంలో కేంద్రంలో తర్జన భర్జనలు సాగుతున్నట్లుగా సమాచారం. ఆయన ఆస్తులు జప్తు చేసేందుకు అవసరమైన ఆధారాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. అయితే ఈ అంశంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్నదానిపై రెండు కీలక మంత్రిత్వ శాఖలు సమాలోచనలు చేస్తున్నాయని తెలుస్తోంది. జగన్ కంపెనీల్లోకి వచ్చిన సొమ్ము విషయమై కనుగొనేందుకు త్వరలో రెండు బృందాలు మారిషస్ వెళ్లనున్నాయి. ఈ బృందాలు మారిషస్ వెళ్లొచ్చాక ఆస్తులు జప్తు చేయాలా? లేదా ఇప్పుడే చేయాలా? అనే అంశంపై రెండు మంత్రిత్వ శాఖల మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉందట. మారిషస్ వెళ్లొచ్చాక అక్కడ లభించిన పత్రాల ఆధారంగా ఆస్తులను జప్తు చేస్తే పకడ్బంధీగా ఉంటుందని ఓ మంత్రిత్వశాఖ అభిప్రాయపడుతుండగా, ఇప్పటికే లభించిన ఆధారాలు సరిపోతాయని మరో మంత్రిత్వశాఖ అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం. అంతిమంగా మారిషస్ వెళ్లొచ్చాకే ఆస్తులు జప్తు చేసేందుకు ముందడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.

కాగా మారిషస్ కేంద్రంగా జగన్, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థిక లావాదేవీలు సాగించినట్లుగా దర్యాఫ్తులో వెల్లడైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జగన్‌తో సంబంధమున్న పదహారు కంపెనీల ఆర్థిక లావాదేవీలను ఆరా తీసేందుకు రెండు బృందాలను కేంద్రం మారిషస్ పంపాలని నిర్ణయించుకుంది. అయితే రెండు బృందాలను ఒకేసారి పంపాలా? వేరు వేరుగా పంపాలా? ఒక్కో బృందంలో ఎంతమందిని పంపాలి? అనే విషయంపై కసరత్తు జరుగుతోందని సమాచారం. మారిషస్ కేంద్రం సాగిన లావాదేవీల వివరాలు అందజేయాలని, వాటిని అధ్యయనం చేసేందుకు రానున్న బృందానికి సహకారమందించాలని ఇప్పటికే కేంద్రం అక్కడి అధికారులకు లేఖ కూడా రాసింది. నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో అధికారుల బృందాన్ని పంపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జగన్, గాలి ఆర్థిక అనుబంధం గురించి మూడున్నరేళ్ల క్రితమే నిఘావర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయట. కేంద్రానికి నివేదిక కూడా అందించినట్లు సమాచారం. అయితే ఒత్తిళ్ల కారణంగా ఆ నివేదిక బుట్టదాఖలు అయిందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ ఒత్తిళ్లపై కూడా కేంద్రంలోని కీలక మంత్రిత్వ శాఖలు ఇప్పుడు దృష్టి సారించినట్లుగా సమాచారం.

English summary
It seems, Central Government stepping towards YSR Congress Party chief YS Jaganmohan Reddy's properties seize.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X