హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటికి చిక్కిన కెసిఆర్, అసంతృప్తి: జోస్యం కరెక్టా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal - K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కి అడ్డంగా దొరికిపోయారంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో 270 స్థానాల్లో సమైక్యవాదమే గెలుస్తుందన్న జోస్యం కూడా అసాధ్యమంటున్నారు. హైదరాబాదులో గతంలో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో తెరాస పోటీ చేయలేదు. హైదరాబాదులో ఆ పార్టీకి పెద్దగా పట్టులేదు.

దీంతో పోటీ చేసి ఓడిపోవడమేందుకనే అభిప్రాయంతో పోటీకి దూరంగా నిలిచింది. ఇప్పుడు అదే పాయింటును లగడపాటి పట్టుకున్నారు. హైదరాబాదులో తెలంగాణపై రిఫరెండానికి కెసిఆర్ సిద్ధమన్నారు. సవాల్‌కు నగర మంత్రి దానం నాగేందర్ సై అన్నారు. లగడపాటి కూడా పోటీతో పరోక్షంగా రిఫరెండానికి సిద్ధమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ బలంగా లేకపోవడంతో కార్పోరేషన్ ఎన్నికలకు దూరంగా ఉండటం ఇప్పుడు లగడపాటికి ఆయుధంగా మారిందని అంటున్నారు.

అంతేకాకుండా కెసిఆర్ రెఫరెండానికి సై అనడం తెలంగాణవాదుల్లోనే కాకుండా తెరాసలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. హైదరాబాదు తెలంగాణలో భాగమేనని, కెసిఆర్ సవాల్ వల్ల హైదారాబాద్ విభజనకు అసలు సమస్య అన్న విషయాన్ని అంగీకరించినట్లయిందని ఆవేదన చెందుతున్నారట. అయితే రెఫరెండానికి సై అనడం ద్వారా సీమాంధ్ర నేతలకు హైదరాబాద్‌కు గట్టిగా సమాధానం ఇచ్చినట్లయిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

రెఫరెండానికి ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నప్పటికీ దానికి మన చట్టాలు ఒప్పుకోవు. కానీ, పోటీ చేయడం ద్వారా హైదరాబాదీల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశముందు. రెఫరెండం పెట్టినా, పోటీకి దిగినా హైదరాబాదులో సమైక్యవాదమే గెలుస్తుందని లగడపాటి వంటి సీమాంధ్ర నేతలు బలంగా నమ్ముతున్నారు.

లగడపాటి జోస్యానికి సీన్ లేదా?

వచ్చే ఎన్నికల్లో లగడపాటి చెప్పినట్లుగా 270 స్థానాల్లో సమైక్యవాదం గెలుస్తుందన్న జోస్యం ఖచ్చితంగా తప్పవుతుందని తెలంగాణ నేతలు అంటున్నారు. కేవలం తెలంగాణలోనే 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని అంతేకాకుండా, సీమాంధ్రలో కూడా విభజన వాదం రగులుతోందని, ఇలాంటి సమయంలో లగడపాటి జోస్యం తప్పవుతుందంటున్నారు.

English summary

 It is said that Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao is in Vijayawada MP Lagadapati Rajagopal's trap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X