ఫొటోలు: లగడపాటి సమైక్యాంధ్ర వెరైటీలు

హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సమైక్యాంధ్ర కోసం మరోసారి హంగామా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన చేసిన తర్వాత ఆయన ఆందోళనలు చేపట్టారు. విజయవాడలో నిరాహార దీక్షకు దిగారు. అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా పోలీసుల కళ్లు గప్పి విజయవాడ నుంచి హైదరాబాదు చేరుకున్నారు.

సమైక్యాంధ్ర కోసం లగడపాటి రాజగోపాల్ చేసే, చేస్తున్న కార్యక్రమాలు హంగామాను తలపిస్తాయి. ఆయన కార్యక్రమాలు వింతగానూ, ప్రజలను ఆకట్టుకునే విధంగానూ ఉంటాయి. ప్రజల దృష్టినే కాకుండా మీడియా దృష్టిని కూడా తన వైపు తిప్పుకునే వ్యవహారశైలి ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

తాజాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కనువిప్పు కలిగిస్తానంటూ లగడపాటి రాజగోపాల్ హంగామా చేశారు. కృష్ణా జిల్లాలో పాదయాత్రలో భాగంగా అడుగుపెడుతున్న చంద్రబాబుకు సమైక్యావాదం గురించి వివరిస్తానని ఆయన చెప్పి, అర్థరాత్రి విజయవాడ వదిలి కృష్ణా జిల్లా సరిహద్దులకు చేరుకున్నారు. పోలీసులు ఆయనకు గృహ నిర్బంధం విధించారు. విద్యార్థులను తనకు అండగా ఆయన కూడగట్టుకుంటున్నారు.

ఫొటోలు: లగడపాటి సమైక్యాంధ్ర వెరైటీలు

లగడపాటి రాజగోపాల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోసం 2009లో విజయవాడలో దీక్ష చేపట్టారు.

ఫొటోలు: లగడపాటి సమైక్యాంధ్ర వెరైటీలు

సమైక్యాంధ్ర కోసం దీక్ష చేపట్టిన లగడపాటి రాజగోపాల్‌ను తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ముద్దు పెట్టుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనం.

ఫొటోలు: లగడపాటి సమైక్యాంధ్ర వెరైటీలు

విజయవాడలో దీక్ష చేస్తూ ఓ అర్థరాత్రి పోలీసుల కళ్లు గప్పి ఆయన హైదరాబాదుకు తరలి వచ్చారు.

ఫొటోలు: లగడపాటి సమైక్యాంధ్ర వెరైటీలు

విజయవాడ నుంచి అందరి హైదరాబాద్ రహస్యంగా వచ్చి నిమ్స్‌లోకి పరిగెత్తుతూ కెమెరాలకు ఇలా చిక్కారు.

ఫొటోలు: లగడపాటి సమైక్యాంధ్ర వెరైటీలు

విజయవాడ నుంచి నిమ్స్‌కు చేరుకుని అక్కడ ఆయన చికిత్స పొందారు.

ఫొటోలు: లగడపాటి సమైక్యాంధ్ర వెరైటీలు

సమైక్యాంధ్ర కోసం హైదరాబాదులో దీక్ష చేస్తానంటూ లగడపాటి రాజగోపాల్ ఇలా కనిపించారు.

ఫొటోలు: లగడపాటి సమైక్యాంధ్ర వెరైటీలు

హైదరాబాదులో దీక్ష చేయడానికి ప్రయత్నించిన లగడపాటి రాజగోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఫొటోలు: లగడపాటి సమైక్యాంధ్ర వెరైటీలు

తెలంగాణకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం ప్రకటించనున్నట్లు సంకేతాలు అందిన నేపథ్యంలో సీమాంధ్రలో నిర్వహించిన సమైక్యాంధ్ర సదస్సుల్లో ఆయన కావూరి సాంబశివరావుతో కలిసి పాల్గొన్నారు.

ఫొటోలు: లగడపాటి సమైక్యాంధ్ర వెరైటీలు

సీమాంధ్ర విద్యార్థులు నిర్వహించిన సమైక్యాంధ్ర సదస్సుల్లో ఆయన ఘాటైన ప్రసంగాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+