వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో వెళ్లక తప్పదా!?: చంద్రబాబు డైలామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Chandrababu Naidu
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సవాల్, మద్దతిచ్చే వారితో గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ ప్రతి సవాళ్లు విసురుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల మరో ముందడుగు వేసి మేం అవిశ్వాసం పెడితే మీరు మద్దతిస్తారా? అంటూ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో అవిశ్వాసంపై టిడిపిలో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది.

అవిశ్వాస తీర్మానం వ్యవహారంలో ఎటువంటి వ్యూహంతో వెళ్లాలన్న అంశంపై పొలిట్ బ్యూరో శనివారం ఒక నిర్ణయానికి రాలేదు. అవిశ్వాసంపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో తదుపరి పరిస్థితులను బట్టి పార్టీ వ్యూహాన్ని నిర్ణయించుకోవాలని నిర్ణయించారు. అవిశ్వాసం వ్యవహారంపై ఈ సమావేశంలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయినట్లుగా కనిపిస్తోంది.

అవకాశం దొరికిన ప్రతిసారీ జగన్ పార్టీ డబ్బు విరజిమ్మి మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మనను బలహీనపర్చడానికి ప్రయత్నం చేస్తోందని, అలాంటప్పుడు ఆ పార్టీ అడగ్గానే మనం ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని, ఆ పార్టీ పెడితే మనం ఎందుకు బలపర్చాలని, శాసనసభ స్పీకర్, డిఫ్యూటీ స్పీకర్ పోస్టులకు మనం పోటీపడగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార పార్టీకి మద్దతిచ్చిందని, మనమూ మనకు లాభం ఉందనుకొన్నప్పుడు ప్రజల కోణంలో అవిశ్వాసం గురించి ఆలోచించాలని పలువురు సూచించారు.

మరికొందరు నేతలు భిన్నమైన వాదన వినిపించారు. ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉండగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించి దానిని మనం బలపర్చాల్సి వస్తే బాగుండదని, అలాగని దూరంగా ఉన్నా రాజకీయంగా నష్టపోతామని, దానికి బదులు మనమే అవిశ్వాసం ప్రతిపాదిద్దామని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పడిపోయి మద్యంతర ఎన్నికలు వచ్చినా ఫర్వాలేదని, అటూ ఇటూ కాకుండా ఉపఎన్నికలు వస్తేనే చికాకని చెప్పారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మరోసారి చర్చించాలని నిశ్చయించారు.

English summary
Telugudesam party is in dilemma on No Confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X