ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: అద్దంకి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కిరిసిపాడు, సంతమాగులూరు, బల్లికురవ, జె పంగులూరు, అ ద్దంకి మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. గతంలో ఉన్న మార్టురు నియోజకవర్గం రద్దు అయింది. వర్గ పోరుకు వేదికైన మార్టురులో గొట్టిపాటి - కరణం వర్గాల మధ్య రాజకీయ అధిపత్య పోరు కొనసాగింది. మార్టూరు నియోజకవర్గం లో గొట్టిపాటి హనుమంతరావు రెండు సార్లు, కరణం బలరామకృష్ణమూర్తి రెండు సార్లు, హనుమంతరావు కుమారుడు నర్స య్య ఒక ఉప ఎన్నిక తో సహా రెండు సార్లు గెలిచారు. ఈ నియోజకవర్గంలో మొత్తంగా పదకొండు సార్లు ఎన్నికలు జరగ్గా టిడిపి ఆరుసార్లు, కాంగ్రెస్ రెండు సార్లు, జనతా, కెఎల్‌పి, స్వతంత్ర అభ్యర్దులు ఒక్కోసారి చొప్పున గెలుపొందారు. 1983 లో ఇక్కడి నుండి జరిగిన ఉప ఎన్నికలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలిచారు. 2004 నాటికి గొట్టిపాటి కుటుంబంలో వచ్చి న వివాదాలు నర్సయ్యను దెబ్బ తీసాయి. 2004 లో ఆయనకు తమ్ముడయ్యే రవి కుమార్ పోటీ చేసి గెలిచారు.
అద్దంకి లో 13 సార్లు ఎన్నికలు..
అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి నాలుగు సార్లు, కెఎల్‌పి, సిపిఐ చెరోక సారి, స్వతంత్ర అభ్యర్ది ఒక సారి గెలుపొందారు. వైసిపి ఒక సారి గెలిచింది. ఇక్కడ కీలకనేత అయిన కరణం బలరాం అద్దంకి లో రెండు సార్లు, మార్టూరు లో రెండు సార్లు గెలిచారు. ఒంగోలు లోక్‌సభ నుండి సైతం ఒక సారి గెలుపొందారు. అద్దంకి లో బాచిన చెంచు గరటయ్య రెండు సార్లు గెలిచారు. 2009 ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవ టంతో కాంగ్రెస్ లో చేరారు. 2004 ఎన్నికల్లో గెలిచిన కరణం బలరాం పై..2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గొట్టిపాటి రవి గెలుపొందారు. ఆ తరువాత నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరిగాయి.

2014 లో వైసిపి గెలుపు..
అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 230531 ఓట్లు ఉండగా, అందులో 198299 ఓట్లు పోలయ్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన గొట్టిపాటి రవి కుమార్ కు 99537 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన కరణం వెంకటేష్ కు 95302 ఓట్లు వచ్చా యి. వైసిపి అభ్యర్ధి గొట్టిపాటి రవి కుమార్ 4235 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2012 లో కాంగ్రెస్ ప్రభుత్వం పై అవిశ్వా స తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటం తో అనర్హత వేటు పడింది. ఆ తరువాత వైసిపి లో చేరి 2014 లో పోటీ చేసారు. గెలిచిన తరువాత టిడిపిలోకి ఫిరాయించారు. ప్రస్తుతం టిడిపి అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గా ఉన్నారు.












Click it and Unblock the Notifications