ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: శ్రీశైలం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
గతంలో ఆత్మకూరు నియోజకవర్గం 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం ఏర్పా టు అయింది. ఏరాసు - బుడ్డా కుటుంబాలే ఈ ప్రాంతంలో తొలి నుండి రాజకీయంగా ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీవైలం కావటం తో ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటుగా..వర్గా రాజకీయాలు ఎక్కువే. ఇక, ఇక్కడి నుండి టిడిపి - కాంగ్రెస్ మధ్య హోరా హోరీగా ప్రతీసారి పోరు నెలకొనేది. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి శ్రీశైలం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆత్మకూరు నియోజకవర్గం లోని ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం మండలా లతో పాటుగా నంద్యాల నియోకవర్గం నుండి మహానంది మండలం శ్రీశైలం నియోజకవర్గం లో చేరింది.
1978 నుండి రాజకీయ పోరు..
తొలుత మిడ్తూరు నియోజకవర్గం గా ఉన్న సమయంలో ఏరాసు అయ్యప్పరెడ్డి ఇక్కడి నుండి గెలుపొందారు. ఆయన అంజయ్య క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు. ఆయన కుమారుడు ఏరాసు ప్రతాపరెడ్డి సైతం ఇక్కడి నుండి ఎమ్మె ల్యే గా గెలిచి మంత్రి పదవి నిర్వహించారు. ఇక్కడి ప్రముఖ నేత బుడ్డా వెంగళరెడ్డి టిడిపి నుండి రెండు సార్లు, కాంగ్రె స్ నుండి ఒకసారి గెలుపొందారు. ఏరాసు ప్రతాపరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బుడ్డా వెంగళ రెడ్డిని 1999 కు ముందు నక్సలైట్లు హతమార్చారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన ప్రజారాజ్యం అభ్యర్ధి బుడ్డా శేషారెడ్డి కి 16455 ఓట్లు లభించాయి. 2014 ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంలో సమీకరణాలు అన్నీ మారిపోయాయి.

2014 ఎన్నికల్లో వైసిపి గెలుపు..
2014 ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 189963 ఉండగా, అందులో 147668 ఓట్లు పోలయ్యా యి. అప్పటి వరకు టిడిపిలో ఉన్న బుడ్డా రాజశేఖర రెడ్డి వైసిపి లో చేరి వైసిపి నుండి పోటీ చేసారు. ఆయనకు 2014 ఎన్నికల్లో 74249 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్ధి శిల్పా చక్రపాణిరెడ్డికి 69388 ఓట్లు పోలయ్యాయి. వైసిపి అభ్యర్ధి రాజశేఖర రెడ్డి 4861 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నిక తరువాత కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారి పోయాయి. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధిగా గెలిచిన బుడ్డా రాజశేఖర రెడ్డి ఆ తరువాత టిడిపి లో చేరారు. అదే విధంగా 2014 ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి ప్రస్తుతం వైసిపిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications