బీజేపీ 'కొత్త' వ్యూహం, బాబుకు దిమ్మతిరిగే షాక్: ఆ ప్రశ్నకు జవాబు లేదా?
అమరావతి: ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎదురుదాడికి సిద్ధమయింది. శుక్రవారం బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు, ఆయనకు ఏపీ బీజేపీ అధ్యక్షులు హరిబాబు మద్దతు, రాయలసీమకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని రాయలసీమ బీజేపీ నేతలు మాట్లాడటమే నిదర్శనం.
Recommended Video

ప్రత్యేక హోదా అంశంతో తమను ఇబ్బంది పెట్టాలని భావిస్తున్న చంద్రబాబును ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. తిరిగి హోదా అంశాన్ని లేవనెత్తినందున గతంలో ఆయన చెప్పిన మాటలతోనే కౌంటర్ ఇస్తోంది.

చంద్రబాబు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేశారా?
బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని అంటున్నారు. ఏపీకి న్యాయం కోసం ఎంతో పోరాడామని, కానీ ఫలితం లేకుండా పోయిందని, అందుకే గట్టిగా నిలదీస్తున్నానని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోదా మా హక్కు అని, అది ఇవ్వాల్సిందేనని రెండు రోజులుగా చెబుతున్నారు.

టీడీపీని ఇరుకున పెట్టాల్సిందే
చంద్రబాబు ఏం చేయబోతున్నారో బీజేపీకి కూడా అర్థమయి ఉంటుందని, అందుకే ఆ పార్టీ కూడా పార్టీని కాపాడుకునేందుకు సాధ్యమైనంత మేర టీడీపీని ఇరుకున పెట్టాలని ఏపీ బీజేపీ నాయకులు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. హోదా అంశంతో మనలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోవద్దని నిర్ణయించుకున్నారు.

చంద్రబాబుకు అలా దిమ్మతిరిగే షాక్
ప్రత్యేక హోదా, విభజన హామీలు తమ హక్కు అని చంద్రబాబు చెబుతున్నారు. అయితే గతంలో హోదాపై ఆయన చేసిన వ్యాఖ్యలతో బీజేపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. హోదా కంటే ప్యాకేజీయే బెట్టర్ అని చంద్రబాబు సహా టీడీపీ నేతలు చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఇది టీడీపీని ఇరుకున పెట్టే అంశమే అంటున్నారు.

హోదాపై టీడీపీ ఇలా
అందుకే టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ.. చంద్రబాబు హోదా వద్దని ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. కానీ ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అని చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించారని చెబుతున్నారు. టీడీపీ హోదా విషయంలో ఎప్పటికప్పుడు మాట మారుస్తోందని వైసీపీ కూడా విమర్శిస్తోంది. అయితే హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెబితేనే తాము అంగీకరించామని టీడీపీ చెబుతోంది. కానీ హోదా వల్ల ఉపయోగం లేదని, హోదా కంటే ప్యాకేజీయే బెట్టర్ అన్న వ్యాఖ్యలకు టీడీపీ వద్ద సమాధానం లేదని అంటున్నారు. హోదా కంటే ప్యాకేజీ బెట్టర్ అయితే దాని కోసమే పోరాడాలి కదా అంటున్నారు.

సాధ్యమైనంత మేర ఇరుకునపెట్టే ప్రయత్నం
చంద్రబాబును సాధ్యమైనంత మేర ఇరుకున పడేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకే కొత్తగా బీజేపీ రాయలసీమ నేతలు తెరపైకి వచ్చారు. వీరు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని, హైకోర్టు ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ భవనం నిర్మించాలని, శీతాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించాలని, సీమలో ఉన్న నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలుగా చేయాలని, సీమ ప్రాజెక్టులకు రూ.20వేల కోట్లు కేటాయించాలని, చేతి వృత్తిదారులకు నిధి ఏర్పాటు చేయాలనే డిమాండ్లు తెరపైకి తెచ్చారు.












Click it and Unblock the Notifications