ఇదిగో 'ఫ్యాన్' గాలి!: రోడ్డుపై ఫ్యామిలీ (పిక్చర్స్)

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిలలు రోడ్డెక్కారు. కుటుంబ సభ్యులైన ఆ పార్టీ నేతలు వేర్వేరు ప్రాంతాల్లో సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

అనంతపురం జిల్లాలో విజయమ్మ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో షర్మిల, తూర్పు గోదావరి జిల్లాలో వైయస్ జగన్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెసు, తెలుగుదేశం, జై సమైక్యాంధ్ర పార్టీలపై నిప్పులు చెరిగారు.

జగన్‌తోనే సువర్ణయుగం సాధ్యమని వైయస్ విజయమ్మ చెప్పారు. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారని, పార్టీని కాంగ్రెసును అమ్మేసిన చిరుకు, అమ్ముడుపోయిన చంద్రబాబుకు తేడా లేదని షర్మిల విమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెసు

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే వైయస్ సువర్ణయుగం వస్తుందని, వైయస్ అమలు చేసిన పథకాలతో పాటు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారని విజయమ్మ చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

అమ్మ ఒడి పథకం, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతో పాటు పెన్షన్‌లు రూ.700కు పెంచుతారని విజయమ్మ అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తారని, ముడి సరుకులను రాయితీకు ఇస్తారని, వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసి నేత కార్మికుల్లో ధైర్యం నింపుతారని విజయమ్మ చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

ప్రజల ఆశీర్వాదాలతో కాబోయే ముఖ్యమంత్రి జగనన్నేనని షర్మిల అన్నారు. సోమవారం రాత్రి ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మం జూరవుతాయని తెలిపారు. వైయస్ మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు తమ కుటుంబానికి వచ్చిన ప్రతి కష్టంలోనూ మేకపాటి కుటుంబం అండగా నిలిచిందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జగనన్నకు మేకపాటి కుటుంబసభ్యులు అండగా నిలిచిన విషయం ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అలాంటి మేకపాటి కుటుంబాన్ని రాబోవు ఎన్నికల్లో గెలిపించుకుందామని ఆమె పిలుపునిచ్చారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

ఇతర పార్టీలు ప్రలోభాలకు గురి చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒక్కసారి గుర్తుచేసుకుని రాజన్న రాజ్యం కోసం వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

జగనన్నకు అత్యంత సన్నిహితుడైన మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పిన పనులన్నీ జరిగి తీరుతాయని, ఆత్మకూరు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తీరుతుందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

ప్రజాసంక్షేమమే లక్ష్యంగా చెరగని ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతున్న జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

రైతులకు రుణమాఫీ చేసిన ఘనత వైయస్‌దేనని షర్మిల చెప్పారు. వైయస్ హయాంలో ఏ పన్ను పెంచకుండానే అన్ని సంక్షేమ పథకాలను పేదప్రజలకు అందించారని గుర్తుచేశారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం రైతన్నలను పట్టించుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. కరెంటు చార్జీలు విపరీతంగా పెరిగాయని, గ్యాస్ ధర పేదలకు అందని స్థాయికి చేరిందని విమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు

రాష్ట్ర విభజనకు సహకరించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని షర్మిల ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+