ఘర్షణ: నన్నపనేని ఇలా పడిపోయారు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనమండలిలో ప్రతిపాదించిన నేపథ్యంలో ప్రాంతాలవారీగా ఎమ్మెల్సీలు విడిపోయి, వివాదాలకు దిగారు. దీంతో సోమవారం శాసనమండలి వెలుపల ఘర్షణ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతిని చించేయడానికి ప్రయత్నించారు.
సతీష్ రెడ్డి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్సీ స్వామి గౌడ్ ప్రచయత్నించారు. ఈ స్థితిలో తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కింద పడిపోయారు.
స్వామి గౌడ్ తోసేయడం వల్లనే ఆమె కింద పడిపోయారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో నన్నపనేని రాజకుమారి తనకు జరిగిన అవమానంపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వద్ద మొర పెట్టుకున్నారు.

శమంతకమణి డ్రామా..
రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందని తెలియజేయడానికి తెలుగుదేశం ఎమ్మెల్సీ శమంతకమణి ఇలా డ్రామా వేసి చూపించారు.

కిందపడిన నన్నపనేని
ఎమ్మెల్సీల మధ్య జరిగిన తోపులాటలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కిందపడిపోయారు.

ఇద్దరి మధ్య వాదులాట..
తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతిని చింపడానికి ప్రయత్నిస్తున్న టిడిపి ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని అడ్డుకోవడానికి తెరాస ఎమ్మెల్సీ స్వామి గౌడ్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు.

తెరాస ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి..
తెలంగాణపై సీమాంధ్ర ఎమ్మెల్సీల తీరును నిరసిస్తూ తెరాస ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి ఇలా..

ఘర్షణ వాతావరణం..
తెలంగాణ ముసాయిదా బిల్లును మండలిలో ప్రతిపాదించిన నేపథ్యంలో సోమవారం ఉద్రిక్త వాతావరణం ఇలా..

నన్నపనేని ఆగ్రహం..
తెలంగాణ ఎమ్మెల్సీలు అన్నదమ్ముల్లా విడిపోదాం, అన్యోన్యంగా కలిసుందామని నినాదాలు చేస్తున్న తెలంగాణ ఎమ్మెల్సీలకు వ్యతిరేకంగా నన్నపనేని రాజకుమారి ఇలా..

నన్నపనేని బైఠాయింపు..
తెలంగాణ ఎమ్మెల్సీలు తమ వాదనలు వినిపిస్తుంటే తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఇలా బైఠాయించారు.

తోపులాటలో ఇలా..
తెలంగాణ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, సీమాంధ్ర ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి మధ్య జరిగిన గొడవలో నన్నపనేని రాజకుమారి ఇలా..

ఇలా వాగ్వివాదం..
టిడిపి ఎమ్మెల్సీ సతీష్ రెడ్డితో తెలంగాణ ఎమ్మెల్సీలు వాదనకు దిగారు. నన్నపనేని రాజకుమారి సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ఇలా కనిపించారు.

దిలీప్‌తో నన్నపనేని వాదన
తెలంగాణ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్‌తో నన్నపనేని రాజకుమారి వాదనకు దిగారు. ఇరు ప్రాంతాల ఎమ్మెల్సీలు విడిపోయి వాగ్వివాదానికి దిగారు.

బల్లపైకి చేరుకుని నినాదాలు..
నన్నపనేని రాజకుమారితో పాటు తెలంగాణ ఎమ్మెల్సీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన బల్లపైకి ఎక్కి పోటాపోటీ నినాదాలు చేశారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications