డిగ్గీతో రాములమ్మ గుసగుస, కార్లో వెళ్తూ (పిక్చర్స్)

న్యూఢిల్లీ: మెదక్ జిల్లా పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో కలిసి ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధిని ఆమె నివాసంలో కలుసుకున్నారు.

పార్టీ కండువా కప్పి విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కల సాకారమైందని, గతంలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరనని, పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలమే తెలంగాణ వచ్చిందని విజయశాంతి అన్నారు.

రెండు రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా ఉండాలని, రెండు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎవరైనా, ఏ నాయకుడైనాసరే ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని పరోక్షంగా కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. అప్పుడే ఆ నాయకుడి మీది ప్రజలకు నమ్మకం ఉంటుందని, కానీ నాయకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నారన్నారు.

రాములమ్మకు సోనియా కండువా

రాములమ్మకు సోనియా కండువా

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పరోక్ష విమర్శలు చేశారు. నాయకుడంటే ఇచ్చిన మాటకు కట్టుబడాలని ఆమె అన్నారు.

సోనియా, డిగ్గీలతో రాములమ్మ

సోనియా, డిగ్గీలతో రాములమ్మ

కాంగ్రెసులో తెరాస విలీనంపై కెసిఆర్ తీరుపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె ఆ విధంగా స్పందించారు. నాయకుడంటే గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, అప్పుడే ప్రజలు నమ్ముతారని ఆమె అన్నారు. కొంతమంది నాయకులు మాట నిలబెట్టుకోలేకపోతున్నారని ఆమె అన్నారు.

డిగ్గీ, సోనియాలతో రాములమ్మ

డిగ్గీ, సోనియాలతో రాములమ్మ

సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత విజయశాంతి దిగ్విజయ్ సింగ్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవరూపం ధరించడంతో విజయశాంతి కాంగ్రెసు పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారని, విజయశాంతి పార్టీలో చేరారని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

డిగ్గీ, సోనియాలతో విజయశాంతి

డిగ్గీ, సోనియాలతో విజయశాంతి

డిగ్గీ, సోనియాలతో విజయశాంతి

డిగ్గీతో విజయశాంతి

డిగ్గీతో విజయశాంతి

సోనియా గాంధీ కాంగ్రెసు కండువా కప్పి విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజల కల సాకారం కావడంతో తాను కాంగ్రెసులో చేరుతానని చెప్పానని, సోనియా ఆశీస్సులతో తాను కాంగ్రెసులో చేరానని విజయశాంతి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందా, లేదా అనే సందేహం ఉంటూ వచ్చిందని, అది వాస్తరూపం ధరించిందని, ఈ ఘనత తెలంగాణ అమరవీరులకే దక్కాలని ఆమె అన్నారు.

విజయశాంతి, డిగ్గీ

విజయశాంతి, డిగ్గీ

తెలంగాణ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు కాబట్టి తాను కాంగ్రెసులో చేరానని ఆమె చెప్పారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజల ఆనందంగా ఉండాలని ఆమె అన్నారు. తెలంగాణలో వెనకబడిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని తాను కోరుకుంటున్నట్లు విజయశాంతి చెప్పారు.

డిగ్గీ చెవిలో గుసగుస

డిగ్గీ చెవిలో గుసగుస

తెలంగాణ కోసం అందరం పనిచేశామని, చివరి దాకా నిలబడ్డామని అన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది ముఖ్యం కాదని, పార్టీని బలోపేతం చేయడమే తన కర్తవ్యమని ఆమె అన్నారు.

విలేకరులతో...

విలేకరులతో...

మెదక్ జిల్లా పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో కలిసి ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధిని ఆమె నివాసంలో కలుసుకున్నారు.

విక్టరీ సింబల్

విక్టరీ సింబల్

పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని ఆమె చెప్పారు. సోనియా సమక్షంలో పార్టీలో చేరడానికి ముందు విజయశాంతి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ తర్వాత దిగ్విజయ్ సింగ్‌తో కలిసి సోనియా వద్దకు వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+