ఆటోమెటిక్ వాటర్ లెవెల్ కంట్రోల్ యూనిట్ ఆవిష్క్రించిన విశాఖవాసి..

చాలా మంది ఇళ్ల‌లో కానీ, కార్యాలయాల్లోని ఓవర్‌హెడ్ ట్యాంకుల నుంచి నీరు పొంగి ప్రవహించడం చూస్తుంటాం. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు చాలామంది చాలార‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంటారు. అయితే విశాఖ‌ప‌ట్నానికి చెందిన ఓ వ్య‌క్తికి కూడా ఇదే స‌మ‌స్య ఎదుర‌య్యింది. కానీ, అత‌ను ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ఒక వినూత్న ప‌ద్ధ‌తికి శ్రీ‌కారం చుట్టాడు. అదే ఆటోమెటిక్ వాట‌ర్ లెవ‌ల్‌ కంట్రోల్ యూనిట్‌.. విశాఖ‌ప‌ట్నంకు చెందిన బి. ప‌వ‌న్‌కుమార్‌గుప్తా వృధాగా పోతున్న నీటిని ఆదాచేసేందుకు వినూత్న ప‌ద్ధ‌తిలో ఆటోమేటిక్ వాట‌ర్ లెవ‌ల్ కంట్రోల్ యూనిట్‌ను ఆవిష్క‌రించాడు. రండి దీని గురించి తెలుసుకుందాం.

మన ఇంట్లో కానీ, చుట్టుప‌క్క‌ల ఇళ్ల‌లో కానీ, ఓవ‌ర్‌హెడ్ ట్యాంకుల నుంచి నీరు వృధాగా పోతూ ఉంటుంది. ఈ విలువైన నీటిని ఆదాచేసేందుకు చాలామంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కానీ, స‌మ‌స్యమూల‌లా గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం ఏ ఒక్క‌రూ చేసి ఉండ‌రు. కానీ, ఈ విశాఖ వాసి మాత్రం ఆ స‌మ‌స్య మూలాల‌ను తెలుసుకుని వేలాది లీట‌ర్ల నీటిని ఆదా చేసేందుకు త‌న వంతుగా కృషి చేశాడు. అంతేకాకుండా ప‌ర్యావ‌ర‌ణానికి భారీ న‌ష్టం వాటిళ్ల‌కుండా చేశాడు.

Automatic water level control unit was invented by a Visakha resident.

దీని గురించి తెలుసుకునే ముందు నేను మా ఓవర్‌హెడ్ ట్యాంక్‌పై ప్రయోగాలు చేశాను. మా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ట్యాంక్‌ను పాడుచేసినందుకు మా అమ్మ నన్ను తిట్టింది కూడా. అయినా మా నాన్నగారు న‌న్ను నిరంతరం ప్రొత్స‌హించేవారు అని అంటున్నారు ప‌వ‌న్‌. ట్యాంక్ నిండిన తర్వాత విద్యుత్ సరఫరాను ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ చేసేందుకు మార్కెట్లో కొన్ని చాలా ఉత్ప‌త్తులు ఉన్నాయి. కానీ, దీని ద్వారా నీటిని ఆదా చేసేందుకు చాలా మంది వీటిని ఉపయోగించడం లేదని నాక‌ర్థ‌మ‌య్యింది. నేను దీని గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశాను. చాలా మంది నీటిని ఆదాచేసే ఉత్పత్తులను కొనుగోలు చేశారు. కానీ వాటిని మరమ్మతులు చేసిన తర్వాత ఉపయోగించడం మానేశార‌న్న విష‌యం నాకు అర్థ‌మ‌య్యింది అని అంటున్నారు ప‌వ‌న్‌.

వీటికోసం ఉప‌యోగించే పదార్థాలు ఎక్కువగా చైనా నుండి దిగుమతి చేసిన‌వే. వీటి విడిభాగాలు మార్కెట్‌లో ఎక్క‌డా అందుబాటులో లేవు. ఈ ప్రాడ‌క్ట్సు ఎక్కువ‌గా రిపేర్లకు గుర‌వ్వ‌డం జ‌రిగేది. దాంతో కోనుగోలుదారుల్లో అసంతృప్తి పెరిగింది. తిరిగి ఆటోమేటిక్ స్విచ్ఛ్ ఆఫ్ చేసే ఉత్ప‌త్తుల‌ను కోనుగోలు చేసేందుకు ప్ర‌జ‌లు ఎక్కువ మొత్తంలో ఖ‌ర్చుచేసేవార‌ని నాకు తెలిసిందని ప‌వ‌న్ అన్నారు.

ఈ విష‌యాల‌న్నీ గమ‌నించి నేను పూర్తిగా స్వదేశీ, మరమ్మత్తు చేయదగిన ఉత్పత్తిని సృష్టించాను. అదే ఆటోమేటిక్ వాట‌ర్ లెవ‌ల్ కంట్రోల్ యూనిట్‌. ఇది విద్యుత్ షాక్‌ను నివారించేందుకు, అలాగే స్టెప్ డౌన్ బదిలీని ఉపయోగించి ఆల్టర్నేటింగ్ కరెంట్ (A/C)పై పనిచేస్తుంది. దీనిపై నేను ఎన్నో మార్పులు చేశాను. చివ‌ర‌కు 2018 నాటికి దీనిని విజ‌యవంతంగా పూర్తి ఆటోమేట్ ఉత్ప‌త్తిగా త‌యారు చేశాను. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం (SKU) అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (AIC) స‌పోర్టుతో నేను యూనిట్‌ను ఆవిష్క‌రించాను. వైజాగ్‌లోని కలాం డ్రీమ్ ల్యాబ్ వ్యవస్థాపకుడు సతీష్ సూచన మేరకు నేను 2018లో వైజాగ్‌లోని నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC)కి దరఖాస్తు చేసుకున్నాను. ఇటీవ‌లే నాకు ఈ యూనిట్‌పై పేటెంట్ కూడా మంజూరు చేయబడింది అని చెప్పుకొచ్చారు ప‌వ‌న్‌.

పవన్ గుప్తాకు రెండు పేటెంట్లు మంజూరు చేయబడ్డాయి. అందులో ఒకటి అతని 'ఆటోమేటిక్ వాటర్ లెవల్ కంట్రోల్ యూనిట్' కోసం. మ‌రొక‌టి అతని 'కాంపాక్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పుష్ స్విచ్ అసెంబ్లీ' కోసం. అతను కేవలం వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేయడం మాత్ర‌మే కాదు. తన పరిశోధనల ఫలాలను స‌మాజంలోకి తీసుకెళ్లేందుకు ముందడుగు వేశాడు.హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో ఉద్యోగి అయినందున, అతను తన ఉత్పత్తులను వాణిజ్యీకరించడం మొద‌లుపెట్టాడు. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం M/s Avan Tech Innovations Pvt Ltd MD ,మహిళా వ్యాపారవేత్త అయిన B అనూషకు పేటెంట్‌ను కేటాయించాడు.

జెనీవాలోని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్వెంటర్స్ అసోసియేషన్ (IFIA) పవన్‌కి 'ఇన్‌వ్' (ఇన్వెంటర్) బిరుదుతో స‌త్క‌రించింది. బహుశా భారతదేశం నుండి 'Inv' అనే బిరుదును అందుకున్న మూడవ ఆవిష్కర్త అత‌ననేని స‌గ‌ర్వంగా చెబుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+