అక్కినేని నాగేశ్వరరావు
అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంలో మరో బెంగాలీ అమ్మాయి చేరనున్నట్టు సమాచారం. నాగార్జున మొదటి భార్యకు విడాకులు ఇచ్చి బెంగాలీ అయిన అమలను పెళ్ళాడాడు. ఇప్పుడు అక్కినేని మనవడు సుమంత్ బెంగాలీ భామ కమలినీ ముఖర్జీని పెళ్ళాడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల ఆనంద్, గోదావ రి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమలినీ ముఖర్జీ ఈ మధ్య సుమంత్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడుతోంది. కీర్తిరెడ్డిని పెళ్ళి చేసుకున్న సుమంత్ ఏడాదికే ఆమెకు విడాకులు ఇవ్వాల్సివచ్చింది. కీర్తిరెడ్డి ఫాస్ట్ నేచర్‌తో సుమంత్ ఇమడలేకపోయాడని ఆయన సన్నిహితుల కథనం. కీర్తిరెడ్ది ప్రస్తుతం బెంగుళూరులో అమ్మగారి ఇంటివద్ద ఉండి రకరకాల వ్యాపారాలు చేసుకుంటోంది. బెంగాలీ అమ్మాయిలు మంచి టేస్టు కలిగి ఉంటారని, చక్కటి గృహిణులుగా ఉంటారని ప్రతీతి. బెంగాలీ అమ్మాయిలకు చిన్నప్పటి నుంచే సంగీతం, సాహిత్యాలతో పరిచయం ఏర్పడుతుంది. దానితో వాళ్ళకు చక్కటి వ్యక్తిత్వం ఏర్పడుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇలా ఉండగా తరుణ్‌కు కూడా తల్లి రోజారమణి ఒక బెంగాలీ అమ్మాయిని వధువుగా ఎంపిక చేసినట్టు సమాచారం.