మళ్లీ రియల్ ఎస్టేట్ బూమ్
హైదరాబాద్ మహానగర రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎప్పుడు ఏ అంశం ప్రభావితం చేయనుందో ఊహించలేని పరిస్ధితులు ఉన్నాయి. ఆరేడు నెలలుగా నిస్తేజంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం స్పెషల్ ఎకనామిక్ జోన్ల రాకతో కాస్త ఆక్సిజన్ పీల్చుకుని, ఇప్పుడు చిరంజీవి పార్టీకి సంబంధించిన వార్తలతో బూమ్ స్ధాయికి చేరుకుంది. ఇటీవల కుకట్ పల్లి హౌసింగ్ బోర్డులో భూములను ముంబాయి, బెంగళూరుకు చెందిన పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు అధిక ధరలకు కొనుగోలు చేయడమే ఇందుకు ఉదాహరణ.
ఇప్పటికే టీఆర్ ఎస్ బలహీన పడగా, చిరంజీవి రాకతో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అటకెక్కుతుందని భావిస్తున్న బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు నగరం చుట్టూ వంద కిలోమీటర్ల దూరం వరకు భూములను కొనుగోలు చేస్తున్నారు. కానీ చిరంజీవి ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉండే అవకాశం లేకపోలేదు. ఏ విషయం ఉగాది సమయంలో చిరంజీవి పార్టీ ప్రకటించేటప్పుడు కానీ స్పష్టం కాదు












Click it and Unblock the Notifications
