ఏ పార్టీ టికెట్ ఎంత?
ఈసారి తెలుగుదేశం పార్టీ కనీసం యాభై మందికి పైగా కొత్త వారికి టికెట్లు ఇవ్వాలన్నది ఒక అంతర్గత ప్రతిపాదన. మరి ఆ కొత్త అభ్యర్ధి అర్హతలు ఎలా ఉండాలి? కొత్త అభ్యర్ధి కనీసం మూడు కోట్ల రూపాయలను పార్టీ ఫండ్ గా ఇవ్వాలి. కనీసం ఐదు కోట్లను సమీకరించుకుని ఎన్నికల వ్యయానికి సిద్దం కావాలి. అంటే ఎనిమిది కోట్లు. ఎందుకైనా మంచిది కాబట్టి మరో రెండు కోట్లను లిక్విడ్ రూపంలో బంధు మిత్రుల వద్ద దాచుకుని ఉండాలి.
మరి కాంగ్రెస్ పరిస్ధితి ఏమిటి? కాంగ్రెస్ లో కొంత మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే ఎసరు ఉండవచ్చు. ఆయా స్ధానాల్లో టికెట్లు ఆశిస్తున్న కొత్త వారు తెలుగుదేశం టికెట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని వదిలించుకోవలసి ఉంటుంది. ఇక ప్రజారాజ్యం పార్టీ టికెట్లు ఆశించేవారి బాధలు వర్ణణాతీతం. మొదట టాప్ నాయకుల దర్శన భాగ్యం పొందాలంటే కొందరి చేతులు తడుపుకోవలసి వస్తోందని అ నంతపురం జిల్లాలో ఒక స్ధానం నుంచి ప్రజారాజ్యం టికెట్ ఆశిస్తున్న ఒక బడా వ్యాపారి వాపోయారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల టికెట్ల ధరలకు ఏ మాత్రం తగ్గకుండా మెగాస్ధాయిలో అభ్యర్ధుల నుంచి "ఫీజు" రాబట్టుకోవాలని ఆ పార్టీ పెద్దలు సినిమా ఫక్కీలో పట్టుదలగా ఉన్నారు. ఇంత స్ధాయిలో కాక పోయినా కనీసం రెండు కోట్ల రూపాయలను టికెట్ కోసం కొత్త అభ్యర్ధుల నుంచి వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించుకున్నట్టు సమాచారం. సీఎనియర్లు, సిటింగ్ లకు ఈ రేట్లు వర్తించవని గమనించాలి. ఈ రేట్లు అన్నీ కొత్తవారికే.












Click it and Unblock the Notifications