రాష్ట్రంలో కుల సమీకరణలు జోరుగా సాగుతున్నాయి. చిరంజీవి వెనుక కాపులు ర్యాలీ అవుతున్నారు. పెళ్ళిళ్ళలో కుల రాజకీయాల ప్రస్తావనలే వినిపిస్తున్నాయి. మరో వైపు చంద్రబాబు నాయుడికి మద్దతుగా మునుపెన్నడూ ఎరుగని రీతిలో గుంటూరు, కృష్ణా జిల్లాల కమ్మవారిలో ఐక్యత కనిపిస్తోంది. కమ్మ కుల ప్రముఖులు రహస్య సమావేశాలు పెట్టుకుని చంద్రబాబును గెలిపించే వ్యూహాల మీద చర్చించుకుంటున్నారు. హరికృష్ణ మరీ ముఖ్యంగా ఈ సమావేశాలకు హాజరై కులస్ధులను ఉత్సాహపరుస్తున్నారు.
రాజశేఖరరెడ్డి నాయకత్వంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని రెడ్డి కులస్ధులు ఆకాంక్షిస్తున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెడ్డి కులస్ధులలో ఐక్యత ఎక్కువేనని పరిశీలకులు భావిస్తున్నారు.