బాలీవుడ్ నటీనటులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ ల ప్రేమ ముదిరి పాకాన పడిందట. ఒకర్ని విడిచి ఒకరు ఎక్కువ సేపు ఉండలేకపోతున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. షూటింగ్ ముగిసిన వెంటనే మేకప్ తుడిచేసుకుని కరీనా సైఫ్ ముందు రెక్కలు కట్టుకుని వాలిపోతుందట. సైఫ్ కూడా డిటో. ఇంత లేటు వయస్సులో ఎంత ఘాటు ప్రేమయో అని వస్తున్న వ్యాఖ్యలను కూడా సైఫ్ లెక్క చేయడం లేదట. ఇద్దరు కలిసి ప్రస్తుతం ఒక సినిమాలోనే కాకుండా ఒక యాడ్ ఫిలింలో కూడా నటిస్తున్నారు. తదుపరి నటించే సినిమాల్లో హీరోయిన్ గా సైఫ్ కరీనా పేరునే సూచిస్తున్నాడట. మాజీ ప్రియుడితో తెగదెంపులు చేసుకున్న కరీనా కపూర్ కు ఈ కొత్త ప్రేమ కొత్త హుషారును ఇస్తోందట.