శైలజా కిరణ్ వివాదం ఏమిటి?

ఈ నెల ఎనిమిదో తేదీ మంచి రోజు కావడంతో శైలజా కిరణ్ తన మూడేళ్ళ కుమార్తెకు అక్షరాభ్యాసం చేయించడానికి బాసర వెళ్ళారు. అక్కడ ఆమెకు అనుచిత ఆలయ మర్యాదలు జరిగాయంటూ "సాక్షి" వార్తలు ప్రచురించింది. నిజానికి అమెతో పాటు మరికొందరికి కూడా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం లభించినట్టు "సాక్షి" వ్యతిరేక వర్గాలు చెబుతున్నాయి. "సాక్షి"లో ప్రచురించిన ఫోటోలను బట్టి కూడా గర్భ గుడిలో రామోజీరావు కుటుంబ సభ్యులే కాకుండా ఇతరులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. శైలజా కిరణ్ ఫోటోలను తీసిన "సాక్షి" విలేకరి, ఫోటోగ్రాఫర్ పై శైలజ అంగరక్షకుడు దాడి చేయడాన్ని "సాక్షి" యాజమాన్యం/ తీవ్రంగా తీసుకుంది. దీనిపై వైఎస్ జగన్ "సాక్షి"లో మొదటి పేజీలో ఒక నోట్ రాసుకున్నారు. "ఈనాడు" కార్యాలయాల మీద దాడి చేయవద్దని ఆయన తన అభిమానులకు "శాంతి సందేశం" అందించారు.












Click it and Unblock the Notifications
