ఒక చిరు, ఒక శాస్త్రి!

నిజానికి ఒక సామాజిక, రాజకీయ మార్పు కోసం ఎవరు ముందుకు వచ్చినా సహృదయంతో ఆహ్వానించాల్సిన సంపాదకులు తమ యాజమాన్యాలను మెప్పించిడం కోసం ఇటువంటి వేషాలు వేస్తున్నారని అనుకోవడంలో తప్పులేదు. ముందు కొత్తదనాన్ని కోరుకోవాలి. అందువల్ల ప్రస్తుత వ్యవస్ధ కంటే ఎక్కువగా మేలు జరుగుతుందనుకుంటే సామాజిక బాధ్యతగా ఆహ్వానం పలకాలి. కానీ శుభం పలకరా బాబూ అంటే "పెళ్ళి కూతురు ముండ" అంటే ఎలా?
నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణాల ముందు మాస్క్ లు వేసుకుని ఇద్దరు ముగ్గురు రోజు వారీ కూలీకి ఎటువంటి డ్యాన్సులు వేయడానికైనా సిద్ధమవుతుంటారు. ఎవరో ఒకరి భుజంపై చొప్పదంటు విల్లు పెట్టి వ్యంగ్య బాణాలు వేయాలనుకునే సంపాదక శాస్త్రులు కొంచెం ఆలోచించాలి. ఈరోజు గడవగానే సరిపోదు, ఈ జన్మ ఎలా సునాయాశంగా గడిచిపోవాలో ఆలోచించాలి.












Click it and Unblock the Notifications