రోజా భవిష్యత్తు ఏమిటి?

మద్యం బెల్టు షాపులకు వ్యతిరేకంగా "బెల్టు తీస్తా" అని రోజా ఏనాడో చేసిన ప్రకటన సంచలనమైంది. ఇతర పార్టీలు ఇప్పుడు ఆ ప్రకటనలను పదే పదే చేస్తున్నాయి. రోజాను ఒక నియోజకవర్గానికి పరిమితం చేయకుండా రాష్ట్ర మంతటా తిప్పి ప్రచారం చేయించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో ఇటువంటి టాలెంట్లను వాడుకుని ఆ తర్వాత మొండి చేయి చూపడం చంద్రబాబు నాయుడికి మామూలేనని విమర్శకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో జయప్రదను ప్రచారానికి వాడుకుని వదిలేసిన విషయం చాలా మందికి తెలిసిందే. అయితే రోజా జయప్రద అంత సాఫ్ట్ కాదు. తనకు అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడిని చెలిగి పారేసే సత్తా ఆమెకు ఉంది.












Click it and Unblock the Notifications