వచ్చే ఎన్నికల తర్వాత ఏమిటి?

చిరంజీవి పార్టీ తగినన్ని సీట్లు పొందకపోతే ఆ పార్టీ బాధ్యతలను నాగబాబు తీసుకునే అవకాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటన్ని సీట్లు రాకపోయినా చంద్రబాబు నాయుడు అదే రెండు వేళ్ళను చూపుతూ ప్రతిపక్షనాయకుడిగా కూడా రెండు టెర్మ్ లు పనిచేయడానికి సిద్ధం కావడం ఖాయం. కానీ మార్పు ఏమిటంటే టిడిపి తరఫున ఎన్నికయ్యే ఎమ్మెల్యేలలో అనేక మంది అధికారంలోకి రానున్న పార్టీలోకి ఫిరాయించే అవకాశాలున్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రిగా వైఎస్ ను అధిష్టాన వర్గం ఉంచుతుందన్న నమ్మకం లేదు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ కంటే బలవంతుడు కావడాన్ని అధిష్టానవర్గం ఇప్పటికే జీర్ణించుకోలేక పోతోంది. కాంగ్రెసే కనుక అధికారంలోకి వస్తే పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.












Click it and Unblock the Notifications