ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ జగన్ వర్గానికి గెస్ట్ హౌస్ కష్టాలను తెచ్చిపెట్టారు. విజయవాడలో వైయస్ జగన్ లక్ష్యదీక్ష కోసం ఏర్పాట్లు చేసిన అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని వాడుకున్నారు. ఈ విషయం కిరణ్ కుమార్ రెడ్డికి తెలిసిందే. అంతే, సిఎం కార్యాలయం నుంచి జెడ్పీ గెస్ట్ హౌస్ మనుషులకు తాఖీదులు వచ్చాయి. అతిథి గృహం నుంచి వారిని ఖాళీ చేయించాలని, కరెంట్ కట్ చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో అతిథి గృహం అధికారులు వారిని ఖాళీ చేయించారు. దీనిపై అంబటి రాంబాబు భగ్గుమన్నారు. వైయస్ జగన్ వర్గం ప్రతిపక్ష పాత్రలో ప్రభుత్వం దెబ్బను బహుశా తొలిసారి జగన్ వర్గం రుచి చూసింది.