వైయస్ పథాకలను ఇమేజిని అందుకోలేకపోతున్న రోశయ్య

Rosaiah
ముఖ్యమంత్రి రోశయ్యపై బిసి వ్యతిరేకి అన్న ముద్ర గట్టిగా పడుతోంది. ఆయన పరిపాలనను వైయస్ తో పోల్చుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంక్షేమ పథకాలకు రోశయ్య తక్కువ డబ్బులు కేటాయిస్తున్నారని, ఈ పొదుపు ఆయన జీన్స్ లో ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వైయస్ అంత డైనమిక్ గా రోశయ్య లేకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఖజానాలో ఉన్న డబ్బునంతా సంక్షేమ, ఇరిగేషన్ కార్యక్రమాలకు ఖర్చు చేసి ఆయన అకాల మరణం చెందారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలో ఉంది. అయితే వైయస్ ను విమర్శించే అంత ధైర్యం లేక ఆయన ఇంకా రాజశేఖరరెడ్డిని, ఆయన పరిపాలనా శైలిని పొగుడుతున్నారు. ఇది ఆయన హిపోక్రసీకి నిదర్శనమనే విమర్శలు విన్పిస్తున్నాయి.

మద్యంపై 7 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తున్నా సంతృప్తి చెందని ప్రభుత్వం, దివంగతముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తమ కోసం రూపొందించిన సంక్షేమ పథకాలకు కత్తెర వేసేందుకు సిద్ధమవుతున్న వైనం బీసీ వర్గాలను ఆందోళన బాట పట్టిస్తోంది. 'లాభం వస్తే తప్ప ఎలాంటి పని చేయకూడదన్న" ప్రభుత్వ వ్యాపార ధోరణి అటు బీసీ నేతలకూ ఆగ్రహం కలిగిస్తోంది. బోగస్‌ను తొలగించడమంటే..ఆ పేరుతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేయడంగానే బీసీ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+