వైయస్ జగన్ టచ్ లో ఉండవల్లి

Undavalli Arunkumar
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ జగన్ కు దూరంగానే ఉన్నట్లు అనుకుంటున్నారు. ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావుపై సమరాన్ని ముగించుకుని కాంగ్రెసులోనే మామూలుగా ఉండపోదలుచుకున్నట్లు అందరూ భావిస్తున్నారు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ జగన్ తో టచ్ లో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన వైయస్ జగన్ శిబిరంతో మాట్లాడుతున్నట్లు వినికిడి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వంటివారు ఇప్పటికే వైయస్ జగన్ తో చేతులు కలిపేందుకు సిద్ధపడ్డారు. ఈ స్థితిలో ఎందుకైనా మంచిదని ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ జగన్ తో సంబంధాలను కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. వీలైతే జంప్ చేయడానికి అవకాశం ఉంచుకోవాలనేది ఆయన అభిమతమట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+