బాబుకు ఇక్కడా అక్కడా బాగా కలిసొస్తుంది

అయితే వారికి పోలవరం అంశం బాగా కలిసి వచ్చి కెసిఆర్‌ను ఇరుకున పెట్టేశారు. అలాగే విజయమ్మ తన ఆస్తులపై కోర్టుకు వెళ్లడం, హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం టిడిపికి మింగుడు పడలేదు. అయితే సుప్రీం సూచనల మేరకు బాబు అండ్ కో వాదనలు విన్న కోర్టు తాత్కాలికంగా విచారణ నిలిపేసి బాబుకు ఊపిరి తీసుకునే వెసులు బాటు కల్పించింది. ఆస్తులపై అంతిమ తీర్పు కూడా తమకే అనుకూలంగా వస్తుందని టిడిపి విశ్వాసంతో ఉంది. అదే సమయంలో బుధవారం అదిలాబాద్‌లో ప్రారంభమైన బాబు యాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడం గమనార్హం. దీంతో కోర్టు కేసు వీగిపోతే బాబుకు ఇమేజ్ మరింత పెరుగుతుందని అప్పుడు ఇటు తెలంగాణలో అటు సీమాంధ్రలో ఎలాంటి సమస్యలు ఉండవని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications