వైయస్ జగన్ ఎమ్మెల్యేవి అన్నీ బీరాలేనా?

తాము రైతుల కోసం విప్‌ను ధిక్కరించామని ఒక్క వాక్యం రాసేస్తే పని అయిపోతుందని, ఆ మాత్రానికే కాపు రామచంద్రా రెడ్డి ఇంత చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అలా రాసిస్తే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టే చెమటలు పట్టేట్లు తిరుగుతున్నారని ఆడిపోసుకుంటున్నారు. లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కథ కూడా అలాగే సాగుతోందనే మాట వినిపిస్తోంది. దీన్ని బట్టి తాము ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు చెబుతున్న మాటలు పైకి మాత్రమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications