చంచల్‌గుడా జైలు వద్ద బాలుడి 'జై జగన్'

జైలులో ఉన్న వారి ములాఖత్ కోసం ఆ బాలుడు తన కుటుంబ సభ్యులతో వచ్చాడు. జగన్ చూడగానే జైలు గేటుగా ఎదురుగా రోడ్డుకు అడ్డంగా నిలబడి అకస్మాత్తుగా జై జగన్ అంటూ నినదించాడు. సిబిఐ కార్యాలయానికి బయలుదేరుతూ జగన్ వాహనం ఎక్కే సమయంలో ఆ బాలుడు ఆ విధంగా చేశాడు. జగన్ ఆ సమయంలో తనదైన రీతిలో మీడియా ప్రతినిధులకు నమస్తే చెప్పి నవ్వారు. బాలుడి నినాదానికి వెనుదిరిగి తన దీవెనలు అందించారు.
ఆ నినాదంతో అప్రమత్తమై పోలీసులు అటు వైపు చూసి, ఆ నినాదం చేసింది ఓ బాలుడని గ్రహించి నవ్వుకున్నారు. జగన్‌ను అరెస్టు చేసి, తొలి రోజు జైలుకు తీసుకుని వచ్చినప్పుడు ఇద్దరు జగన్ అనుచరులు గొడవ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు వారిద్దరిని పోలీసులు వాహనంలో ఎక్కించుని దూరంగా వదిలేశారు. ఆ మర్నాడు జగన్‌కు అనుకూలంగా ఓ మహిళ న్యూస్ క్లిప్పింగ్స్ పంపిణీ చేసే ప్రయత్నం చేసింది. ఆమెను కూడా పోలీసులు పంపించివేశారు.
ఉదయం పూట సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు గురువారం సాయంత్రం జగన్‌ను జైలుకు తీసుకుని వచ్చేటప్పుడు రోడ్డు మీద పురుగు లేకుండా జాగ్రత్త పడ్డారు. గురువారంనాడు సాయంత్రం జగన్ సిబిఐ కస్టడీ ముగిసింది.












Click it and Unblock the Notifications