వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నెత్తిన కూర్చున్న జగన్ పార్టీ!!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార పార్టీ నెత్తినెక్కి కూర్చుందట!! విషయానికి వస్తే.. అసెంబ్లీలో తమ పార్టీకీ కార్యాలయాన్ని కేటాయించాలని పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సహా పార్టీ ఎమ్మెల్యేలు సభాపతిని కోరిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి అసెంబ్లీలో పార్టీ కార్యాలయాన్ని కేటాయించారు. అయితే ఇది కాస్త కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి పైన ఉందట.

కాంగ్రెసు పార్టీ కార్యాలయం క్రింద ఉంది. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం ఉందట. దీంతో ఇటీవల వర్షాకాల సమావేశాలు జరిగినప్పుడు కానీ, ప్రస్తుతం అసెంబ్లీకి వెళ్తున్న నేతలు గానీ రాష్ట్రంలో జగన్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ, క్రమంగా కాంగ్రెసు పార్టీకి తగ్గుతున్న ఆదరణకు నిదర్శనంగా సిఎల్పీ క్రింద ఉండగా, వైయస్సార్సీఎల్పీ పైన ఉందని వ్యాఖ్యానిస్తున్నారట.

ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సిఎల్బీ వెలవెల పోయిందట. కాంగ్రెసు పార్టీ సభ్యులు పలువురు సభకు హాజరు కాకపోవడం, వచ్చినా క్యాంటీన్‌కు, ప్రాంగణంలోనే ఉండటంతో సిఎల్పీ కార్యాలయం బోసిపోయిందట. అదే సమయంలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ వైయస్సార్సీఎల్పీ కళకళలాడుతూ కనిపించిందట. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకే దగ్గర ఉంటూ కార్యాలయంలో భేటీ అయ్యారట.

English summary

 Assembly authorities allotted YSRCLP in first floor in Assembly and CLP already in ground floor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X