జగన్ గాయం మానింది: మనసంతా పార్టీపైనే..

అయితే, ఫ్రాక్చర్ అయిందేమోనని అనుమానించారు. కానీ అటువంటిదేమీ లేదని ఎక్స్ రేల్లో తేలినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. కేవలం చీలమండ మడత పడినట్లు చెబుతున్నారు. చీలమండ తీవ్రంగా నొప్పి పెడుతోందని జగన్ చెప్పడంతో పరీక్షలు నిర్వహించినట్లు, ఫ్రాక్చర్ ఏమీ లేదని తేలినట్లు, కాస్తా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు జైలు సూపరింటిండెంట్ పి. సైదయ్య చెప్పారని ఆంగ్ల పత్రిక రాసింది.
జైలు వచ్చిన కొత్తలో జగన్ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని, తన గదికే పరిమితమయ్యేవారని, క్రమంగా సహ ఖైదీలతో కలిసిపోతూ వచ్చారని చెబుతున్నారు. వారితో మాట్లాడుతూ, కలిసి టీ తాగుతూ క్రమం తప్పకుండా బ్యాడ్మింటన్ ఆడుతూ కాలం వెళ్లబుచ్చడం అలవాటు చేసుకున్నారని చెబుతున్నారు.
జైలులో ఉన్నా ఆయన దృష్టంతా పార్టీపైనే ఉందట. ఎవరైనా కొత్తగా పరిచయమైతే, వారిది ఏ జిల్లానో కనుక్కుని, ఆ జిల్లాలో తన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారట.












Click it and Unblock the Notifications