వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరంజీవితో వైయస్ జగన్‌కు పోలికా?

అయితే, చిరంజీవితో వైయస్ జగన్మోహన్ రెడ్డిని పోల్చవచ్చా అనేది అసలు వివాదం. చిరంజీవి పార్టీ పెట్టడం గానీ, ఆయన పార్టీని నడిపిన తీరు గానీ వైయస్ జగన్ పార్టీకి వర్తించవు. ఎన్నికల రాజకీయాలు తెలియనివారు చాలా మంది చిరంజీవి చుట్టూ అప్పట్లో ఉన్నారు. అలాగే, వివిధ అంశాలపై ఆయన నిర్దిష్టమైన ప్రకటనలు చేయలేదు. అన్నింటినీ సాధారణీకరిస్తూ పోయారు. మరీ ముఖ్యంగా ఓట్లు వేయించుకునే పటిష్టమైన రాజకీయ యంత్రాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకోలేకపోయారు. పైగా, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వ్యూహాలు అప్పుడు పకడ్బందీగా పనిచేశాయి. ఈ స్థితిలో చిరంజీవి సరిగా సీట్లు సాధించలేకపోయారు. జగన్‌కు అలాంటి పరిస్థితి ఉందా, ఏమో. వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు జగన్ భవిష్యత్తును తేల్చివేస్తాయని మాత్రం చెప్పవచ్చు.