వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ పేరును తొలగించారు, బొమ్మనూ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

 YSR imprint removed from Aarogyasri
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ భవనం పేరును కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మార్పు చేసింది. వైయస్సార్ పేరుతో ఉన్న ఈ భవనం పేరును ఇప్పుడు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌గా మార్చారు. పేదలకు కార్పోరేట్ తరహా వైద్యం అందాలని వైయస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయన మృతి తర్వాత దానికి వైయస్ పేరును పెట్టారు. వైయస్ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టి కాంగ్రెసును లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే.

వైయస్ చేపట్టిన పథకాల క్రెడిట్ జగన్ ఖాతాలకు వెళుతున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ ప్రభుత్వం క్రమంగా వైయస్సార్ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందనేది జగన్ పార్టీ నేతల వాదన. ఈ నేపథ్యంలో కిరణ్ ప్రభుత్వం ఆ దిశగా పలు చర్యలు చేపట్టింది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని వైయస్సార్ భవన్(ఆరోగ్యశ్రీ భవన్) నుంచి ఆయన పేరును తొలగించింది. అంతేకాదు భవన్‌లోకి వెళ్లగానే దర్శనమిచ్చే నిలువెత్తు వైయస్ బొమ్మను కూడా అక్కడ్నుంచి తొలగించారు.

ఆ స్థానంలో రేపో మాపో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఫొటోను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. 2009 సెప్టెంబర్ 2న వైయస్ మరణించిన మరుసటి రోజే ట్రస్ట్‌ భవన్ ఉద్యోగులు సంతాప సభ ఏర్పాటు చేశారు. దీంతోపాటే ఈ భవన్‌కు వైయస్సార్ భవన్‌గా పేరు పెట్టాలని బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. అప్పటి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ ఈ తీర్మానాన్ని ఓకే చేశారు. అప్పటినుంచి ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, వైయస్సార్ భవన్‌గా చలామణీ అవుతోంది.

రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌లోగానీ, కార్డ్‌లలోగానీ ఓ వైపు సిఎం ఫొటో, మరోవైపు వైయస్ ఫొటో ఉండేది. ఇప్పుడు కేవలం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఫొటో మాత్రమే పెట్టారు. అంతేకాదు డయాగ్నస్టిక్స్ స్లిప్‌లు, ఓపీ స్లిప్‌లు, కేస్ షీట్ స్లిప్పుల్లోనూ వైయస్ ఫొటో తీసేశారు. ఇకపై ఆరోగ్యశ్రీ భవన్‌కు వచ్చే ఉత్తరాల్లోగానీ, ఇక్కడ నుంచి పంపే లెటర్‌లలోగానీ, లెటర్ హెడ్‌లలోగానీ, చిరునామాలో గానీ ఎక్కడా వైయస్సార్ భవన్ అనే పేరు కనిపించకూడదని ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది.

గతంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, వైయస్సార్ భవన్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎదురుగా, జూబ్లీహిల్స్ అనే చిరునామా ఉండేది. ఇప్పుడు వైయస్సార్ భవన్, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రెండు పేర్లనూ తొలగించారు. ఆ స్థానంలో ఆ భవనానికి ఉన్న డోర్ నంబర్ వాడుతున్నారు. రాజీవ్ మరణించినా ఆయన పేరు మీద ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుతోందని, మరి వైయస్‌కు ఈ విధానం ఎందుకు వర్తించదని పలువురు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

English summary
The Aarogyasri scheme may be synonymous with the late chief minister YS Rajasekhara Reddy but the Kiran Kumar Reddy government seems to be going all out to erase the former's name from the populist scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X