జయప్రద వెనక చిరు: ఉండవల్లికి టోపీ? (ఫోటోలు)
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు సీటు నుంచి పోటీ చేస్తానని సినీ నటి జయప్రద చేసిన ప్రకటన పలు ఊహాగానాలకు తెరలేపింది. తాను ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని స్పష్టం చేయకపోవడంతో పుకార్లకు రెక్కలు వచ్చాయి. జయప్రద వెనక కేంద్ర మంత్రి చిరంజీవి ఉన్నారని, ఆమెను కాంగ్రెసులోకి తీసుకు రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఓ వైపు ప్రచారం సాగుతోంది. సినీరంగంలో కలిసి పనిచేసిన సాన్నిహిత్యాన్ని వాడుకుని ఆయన జయప్రదను కాంగ్రెసులోకి తీసుకు రావాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
రాజమండ్రి సీటు నుంచి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను కాదని చిరంజీవి జయప్రదకు రాజమండ్రి సీటు ఇప్పించగలరా అనేది ప్రశ్న. ఉండవల్లికి కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర పర్యటనలో ఆమె ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేసింది ఉండవల్లియే. అందువల్ల ఉండవల్లిని కాదని జయప్రదకు చిరంజీవి మాటతో రాజమండ్రి టికెట్ ఇస్తారనేది వట్టి మాటనే అనే వాదన వినిపిస్తోంది.
కాగా, జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు దాదాపు లేనట్లే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్రను ఉద్దేశించే ఆమె విమర్శలు చేశారని అంటున్నారు. ఆమె వైయస్ జగన్ పార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదనే మాట వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరఫున నటుడు మురళీ మోహన్‌కు రాజమండ్రి సీటు ఖాయమైపోయినట్లే. ఈ రకంగా చూసినా తెలుగుదేశం పార్టీలో జయప్రద చేరే అవకాశాలు లేవు.

సినీ రంగంలోకి కలిసి పనిచేసినందున చిరంజీవికి సినీనటి జయప్రదతో సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతో చిరంజీవి జయప్రదను కాంగ్రెసు పార్టీలోకి తెస్తారనే పుకార్లు ఊపందుకున్నాయి.

జయప్రద రాజమండ్రి నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేస్తే ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పరిస్థితి ఏమిటనేది ప్రశ్న. కాంగ్రెసు అధిష్టానం వద్ద ఉండవల్లికి మంచి పలుకుబడి ఉంది. ఆయనను కాదని జయప్రదకు చిరంజీవి రాజమండ్రి టికెట్ ఇప్పించగలరా అనేది ప్రశ్న.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మురళీ మోహన్ రాజమండ్రి నుంచి పోటీ చేయడం ఖాయంగా మారింది. అందువల్ల జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు లేవు.

వైయస్సార్ కాంగ్రెసులో జయప్రద చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఉండవల్లిని ఓడించేందుకు వైయస్ జగన్ జయప్రదను రంగంలోకి దించవచ్చునని అంటున్నారు.
వైయస్ జగన్ పార్టీ మాత్రమే జయప్రదకు రాజమండ్రి సీటును కేటాయించే అవకాశాలున్నాయి. వైయస్‌కు సన్నిహితంగా ఉంటూ, ఇప్పుడు కాంగ్రెసు పార్టీతో ఉన్న ఉండవల్లిని ఓడించాలనే ధ్యేయంతోనే కాకుండా మురళీమోహన్‌ను మట్టి కరిపించాలనే లక్ష్యంతో ఉన్న వైయస్ జగన్ సమ్మోనాస్త్రంగా జయప్రదను ప్రయోగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగా జయప్రద వైయస్సార్ కాంగ్రెసులో చేరే అవకాశాలే ఎక్కువని అంటన్నారు.












Click it and Unblock the Notifications